hyderabadupdates.com Gallery రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం

రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం

రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం post thumbnail image

హైద‌రాబాద్ : న‌టి పూన‌మ్ కౌర్ నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. నిన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ను ఏకి పారేసిన న‌టి తాజాగా త‌న‌కు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, అమెథీ ఎంపీ రాహుల్ గాంధీతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్ర‌క‌టించింది. సినీ , రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఆ మ‌ధ్య‌న రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో త‌ను కూడా పాల్గొంది. ఆయ‌న‌తో పాటు న‌డిచింది. త‌న చేతిని ప‌ట్టుకుని ముందు వ‌రుస‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి త‌న‌కు , రాహుల్ గాంధీకి మ‌ధ్య ఏదో ఉందంటూ కొన‌సాగుతున్న దారుణ‌మైన ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించింది న‌టి పూన‌మ్ కౌర్. మంగ‌ళ‌వారం సీరియ‌స్ అయ్యింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసింది.
త‌న‌కు రాహుల్ గాంధీకి మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌ని పేర్కొంది. అయితే ఆయ‌న ముందు చూపు క‌లిగిన నాయ‌కుడు అని పేర్కొంది. కొన్ని మీడియా సంస్థ‌లు కావాల‌ని తామిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోందంటూ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ఆగ్రహం వ్య‌క్తం చేసింది పూన‌మ్ కౌర్. నటి మొదటిసారిగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో తనకు సంబంధం ఉన్న పుకార్లను బహిరంగంగా ప్రస్తావించింది. వ్యక్తిగత సంబంధాన్ని గట్టిగా ఖండించింది. తన చేనేత వ్యాపారానికి సంబంధించి మాత్రమే రాహుల్ గాంధీని కలిశానని , ఒక కార్యక్రమంలో ఆయనతో కొంతకాలం నడిచానని ఆమె స్పష్టం చేసింది. పూనమ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, తనకు రహస్య పిల్లలు ఉన్నార‌ని కొన్ని సంస్థ‌లు పేర్కొన్నాయంటూ వాపోయింది.
The post రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడుసంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

చెన్నై : ఈసారి ఐపీఎల్ 2026లో ప‌లుసార్లు ఛాంపియ‌న్ గా గెలుపొంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అనుకోకుండా వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. ఈ స‌మ‌యంలో ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్లు ఖ‌ర్చు చేసింది సీఎస్కే

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలిఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ