కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇటు రాజకీయ ప్రత్యర్థులు.. అటు నెటిజన్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “రాహుల్ సర్.. మీ మెనల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?” అంటూ.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు . దీనికి కారణం.. రాహుల్ సోదరి ప్రియాంక-రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వివాహానికి తాజాగా నిశ్చితార్థం జరగడమే!. ఈ వ్యవహారాన్ని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. రేహాన్, అవీవాబేగ్‌ల నిశ్చితార్థం కూడా పూర్తయిందని, ఇద్దరూ రింగులు కూడా మార్చుకున్నారని.. నేషనల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా..
ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా.. ఉత్తమ ఫొటో గ్రాఫర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక, ఆయన ప్రేమికురాలు.. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫరే కావడం గమనార్హం. ఇద్దరికీ 7 సంవత్సరాలుగా పరిచయం ఉందని.. ఈ పరిచయమే ప్రేమగా మారిందని తెలుస్తోంది. దీనికి గాంధీ కుటుంబం కూడా ఓకే చెప్పడంతోపాటు.. పెళ్లికి కూడా రెడీ అవడం విశేషం. పైగా అవీవా ఫ్యామిలీ.. రాబర్ట్ వాద్రా రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామి అని తెలుస్తోంది. దీంతో ఇరు కుటుంబాలు కూడా రేహాన్ వాద్రా, అవీవాల వివాహానికి పచ్చ జెండా ఊపడం జరిగిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నెటిజన్ల కామెంట్లు..
రాహుల్ గాంధీ సోదరి కుమారుడు రేహాన్ వాద్రాకు కూడా వివాహం అయిపోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నెటిజన్లు సహా బీజేపీలోని కొందరు నాయకులు రాహుల్‌పై సెటైర్లు వేస్తున్నారు. “రాహుల్ సర్.. మీ మెనల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?” అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. గాంధీల కుటుంబంలో రాహుల్ ఒక్కరే ప్రస్తుతం పెళ్లికాకుండా మిగిలిన చివరి వారసుడు. ఆయన వయసు.. 55 సంవత్సరాలు. దీంతో తరచుగా రాహుల్ గాంధీ వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. బీజేపీ నేతలు కూడా.. రాహుల్‌పై సెటైర్లు వేస్తూ ఉంటారు. కానీ.. ఇప్పటి వరకు తన వివాహంపై రాహుల్ సీరియస్‌గా ఆలోచన చేయలేదు. తాజాగా ఆయన మేనల్లుడి వివాహం కూడా రెడీ అవడంతో రాహుల్‌ను ఉద్దేశించి.. అటు బీజేపీ నేతలు, ఇటు నెటిజన్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.