hyderabadupdates.com Gallery రూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

రూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

రూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల పాలిట సింహ స్వ‌ప్నంగా మారింది. కబ్జాదారుల‌క‌కు చుక్కులు చూపిస్తోంది. న‌గ‌రంలో చెరువులు, పార్కుల‌ను క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. జూబ్లీహిల్స్‌.. అపోలో ఆసుప‌త్రి ఔట్ గేట్‌కు ఎదురుగా ఇళ్ల మ‌ధ్య దాదాపు 2 ఎక‌రాల మేర‌ పార్కు ఉంది. అక్క‌డ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్ట‌ల్ న‌డుపుతున్న వ్య‌క్తికి.. ఆ పార్కు స్థ‌లంపై క‌న్ను ప‌డింది. ఇంకేముంది 150 గ‌జాల మేర పార్కును ఆక్ర‌మించేశాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గ‌జాల మేర జ‌రిగి పాత భ‌వ‌నానికి ఆనుకుని మ‌రో నిర్మాణం చేప‌ట్టాడు. ఒక్కో అంత‌స్తులో 4 బెడ్లు ప‌ట్టిన‌ట్టు గ‌దులు నిర్మించాడు. ఇంటి య‌జ‌మాని కూడా ఈ క‌బ్జాల‌పై మౌనంగా ఉన్నాడు.
పార్కు వైపు గేటు పెట్టి 100 గ‌జాల మేర ఫార్మ్ హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. అక్క‌డ చుట్టుప‌క్క‌ల నివాసితులు ఊరుకోలేదు. పార్కు క‌బ్జాపై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్ర స్థాయిలో హైడ్రా ప‌రిశీలించింది. పార్కులోకి 50 గ‌జాల మేర జ‌రిగి నిర్మాణం చేప‌ట్టిన‌ట్టు నిర్ధారించుకుంది. మ‌రో 100 గ‌జాల మేర హ‌ద్దులు వేసుకుని ఆక్ర‌మ‌ణ చేసిన‌ట్టు స్ప‌ష్టం చేసుకుంది. ఈ మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో 3 అంత‌స్తుల నిర్మాణాన్ని తొల‌గించారు. పార్కు క‌బ్జా ప్ర‌య‌త్నాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. క‌బ్జాకు పాల్ప‌డిన‌వారిపై పోలీసు స్టేష‌న్లో కేసు పెట్టారు.
The post రూ. 3 కోట్ల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలిఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

అమరావతి : రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత

రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టంరామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

హైద‌రాబాద్ : బిగ్ బాస్ స్టార్ శ్రీ స‌త్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ హీరో రామ్ పోతినేని గురించి తాజాగా స్పందించింది. త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ను లేకుండా నేను ఉండ‌లేనంటూ పేర్కొంది శ్రీ స‌త్య‌. అంతే కాదు త‌న‌కున్న