hyderabadupdates.com Gallery రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం post thumbnail image

పెనుకొండ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుందంటూ వెల్ల‌డించారు.. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 4,035 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ‌ మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. పెనుకొండలోని ప్రఖ్యాతగాంచిన గణగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ. 425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు రెండ్రోజుల కిందట జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహం బోర్డు (ఎస్ఐపీబీ) పచ్చజెండా ఊపిందన్నారు.
60 ఎకరాల్లో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి సవిత తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపు ఏర్పాటుతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా పెనుకొండ అభివృద్ది చెందుతుందన్నారు. దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెనుకొండకు రానున్నారన్నారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 1,035 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందన్నారు. త్వరలోనే ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నట్ల మంత్రి సవిత తెలిపారు.
The post రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /

ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్

హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ భారీ బ‌డ్జెట్ తో ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ది కుమారి కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైంది. ఆశించిన మేర వ‌ర్క‌వుట్ కాలేదు.

CM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డి

  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గతమే ఉంది… భవిష్యత్తు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కళ్ల ముందే పార్టీ కూలిపోతోంటే.. కేసీఆర్‌ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదన్నారు. ప్రతిపక్ష నేత రెండేళ్లుగా శాసనసభకే