hyderabadupdates.com movies రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?

రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ ధరించే జాకెట్లు, కుర్తాలు ఎప్పుడూ స్పెషలే. ఆయన స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మోదీ చేతికి ఉన్న వాచ్ ఒకటి గట్టిగానే వైరల్ అవుతోంది. ఎందుకంటే అది ఏదో విదేశీ బ్రాండ్ రోలెక్స్ వాచ్ కాదు. పక్కా మన దేశంలో తయారైన వాచ్. దాని ధర సుమారు 55 వేల నుంచి 60 వేల రూపాయలు ఉంటుంది. అయితే రేటు కంటే, ఆ వాచ్ డయల్‌లో ఉన్న ఒక పాత కాలపు రూపాయి కాయిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వాచ్‌ను క్లోజ్‌గా గమనిస్తే, అందులో కనిపించేది మామూలు కాయిన్ కాదు. అది 1947 నాటి అరుదైన ఒక రూపాయి బిళ్ళ. బ్రిటీష్ పాలనలో ముద్రించిన చివరి కాయిన్ ఇదే కావడం విశేషం. సరిగ్గా స్వాతంత్ర్యం రావడానికి ముందు, అంటే 1946, 1947 మధ్యలో మాత్రమే ఈ నాణేలను ముద్రించారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కాయిన్‌ను వాచ్‌లో అమర్చడం దీని ప్రత్యేకత. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ఈ మోడల్ పేరు ‘రోమన్ బాగ్’. ఇందులో నడుస్తున్న పులి బొమ్మ కూడా ఉంటుంది, ఇది స్వాతంత్ర్యానికి చిహ్నంగా డిజైన్ చేశారు.

నిజానికి లగ్జరీ వాచీలు అంటే స్విట్జర్లాండ్ గుర్తుకొస్తుంది. కానీ, ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా మన దేశీయ బ్రాండ్‌ను ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జైపూర్ వాచ్ కంపెనీ ఫౌండర్ గౌరవ్ మెహతా కూడా దీనిపై స్పందించారు. మోదీ గారు మా వాచ్ ధరించడం స్వదేశీ స్పిరిట్‌ను, ఇండియన్ బ్రాండ్ విలువను హై లెవెల్ కు పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య జరిగిన పలు కార్యక్రమాల్లో మోదీ ఈ వాచ్‌తోనే కనిపించారు.

ఈ వాచ్ టెక్నికల్ విషయాలకు వస్తే.. ఇది 43 ఎంఎం స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఇందులో జపనీస్ మియోటా మూవ్‌మెంట్ టెక్నాలజీని వాడారు. ఇది గోల్డెన్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో నంబర్స్ ఇంగ్లీష్‌లోనే కాకుండా, మన దేవనాగరి లిపిలో కూడా అందుబాటులో ఉన్నాయి. వాచ్ అద్దం కూడా స్క్రాచ్ పడకుండా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది. 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ దీని సొంతం.

ఈ బ్రాండ్ కేవలం మోదీతోనే ఫేమస్ అవ్వలేదు. గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్, రాపర్ రఫ్తార్ వంటి సెలబ్రిటీలు కూడా జైపూర్ వాచ్ కంపెనీ వాచీలను ధరించారు. కానీ, దేశ ప్రధాని చేతికి ఈ వాచ్ కనిపించడంతో దీని క్రేజ్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది.

Related Post

ప‌వ‌న్ తేల్చేశారు: కూట‌మి నేత‌లే తేల్చుకోవాలి.. !ప‌వ‌న్ తేల్చేశారు: కూట‌మి నేత‌లే తేల్చుకోవాలి.. !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో