hyderabadupdates.com Gallery రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామ‌ని చెప్పారు. విద్యుత్ లైన్లు వేసిన తరువాత వాటి కింద ఇళ్ల నిర్మాణంతోనే భద్రతా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తిస్తే అధికారులకు సమాచారం వెంట‌నే అందించాల‌ని కోరారు.
లైన్లు, స్తంభాల మార్పిడికి సంబంధీకులు దరఖాస్తు చేస్తే లైన్లు మార్చుతామ‌ని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి. విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా లైన్ల మార్పిడి చేపట్టామ‌ని తెలిపారు. ప్రాణాల కంటే ఏదీ విలువైంది కాదని అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ఇదిలా ఉండ‌గా ఎక్కువ‌గా రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రతీ జిల్లాకు రూ. కోటి మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వకూడద‌ని స్పష్టం చేశారు.
The post రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గజాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

న్యూఢిల్లీ : స‌న్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్ర‌భావం అన్ని రంగాల‌లో ఉంటుంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించ‌డం మంచిద‌ని సూచించారు. దేశ రాజ‌ధాని వేధిక‌గా జ‌రిగిన ఏఐ వ‌ర‌ల్డ్

Gujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామాGujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

Gujarat Cabinet : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మరికాసేపట్లో