hyderabadupdates.com movies రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు ఉండవని దాదాపు కన్ఫర్మ్ అయిపోవడంతో అభిమానులు ఉదయం షోలు ఎన్నింటికి మొదలుపెడతారనే దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఒకపక్క ఫైనల్ టచప్ పనులు చూసుకుంటూనే దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్లకు ఎక్కడా తగ్గకుండా నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.

ఈ సందర్భంగా పంచుకుంటున్న విషయాల్లో రెండు బాగా హైలైట్ అయ్యాయి. అవి రైటని కూడా చెప్పాలి. మొదటిది స్పెషల్ సాంగ్ లేకపోవడం. ఏపీ డిప్యూటీ సిఎం పదవిలో ఉన్న వ్యక్తి కెవ్వు కేక లాటి సాంగ్స్ లో స్టెప్పులు వేయడం అంతగా బాగోదు. తప్పేమి కాకపోయినా అపోజిషన్ వాళ్ళు దీన్ని మరో రకంగా తమ స్వార్థానికి వాడుకునే అవకాశం ఉంది. రెండోది మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే పాటను డాన్స్ నెంబర్ లా కాకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మాంటేజ్ కి పరిమితం చేయడం.

ఎందుకంటే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ తరహాలో దీన్ని చిత్రీకరించడం ఇప్పుడున్న ట్రెండ్ లో అంతగా సూట్ అవ్వదు. ఎలాగూ కాలర్ ఎత్తరా రూపంలో మంచి మాస్ గీతం ఒకటి ఉంది కాబట్టి మరొకటి అక్కర్లేదు. అందుకే హరీష్ శంకర్ అలా ప్లాన్ చేశారన్న మాట. రెండున్నర గంటల సినిమాలో పాటల కన్నా ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్ పార్ట్ కోసం అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. వాటి పరంగా సంతృప్తి పరిస్తే చాలు సూపర్ హిట్ ముద్ర పడిపోతుంది.

ఇదంతా ఎలా ఉన్నా ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం పట్ల హరీష్ శంకర్ లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఈసారి ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని ప్రతి చోటా వ్యక్తం చేస్తున్నారు. ఓజి లాంటి క్రేజీ మూవీ తర్వాత వస్తున్న సినిమాగా విపరీతమైన అంచనాలు మోయడం లేదు కానీ థియేటర్లలో మాత్రం పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందనే ట్రేడ్ భారీ పెట్టుబడులు పెడుతోంది. కాకపోతే దురంధర్ రివెంజ్ పోటీని ఏ సెంటర్స్ లో తట్టుకోవడమే కొంచెం టఫ్ అయ్యేలా ఉంది.

Related Post