hyderabadupdates.com movies రెండోసారి… మరో దర్శకుడితో విశాల్ విభేదాలు

రెండోసారి… మరో దర్శకుడితో విశాల్ విభేదాలు

దర్శకుడితో సరైన కో ఆర్డినేషన్ ఉంటేనే సినిమా బాగా వస్తుంది. అది చిన్నదా పెద్దదా లేక ప్యాన్ ఇండియాదా అన్నది కాదు ప్రశ్న. ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగా కుదిరితే తెరమీద అంత అద్భుతాలు జరుగుతాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు రాజమౌళితో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు చేయగలిగారు. చిరంజీవికి కోదండరామిరెడ్డితో, స్వర్గీయ ఎన్టీఆర్ కు రాఘవేంద్రరావుతో ఇలాంటి రిలేషన్ షిప్పే ఉండేది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం విశాల్. తన కొత్త మూవీ మగుడం డైరెక్టర్ రవి అరసుతో వచ్చిన విభేదాల కారణంగా ఇప్పుడు మెగా ఫోన్ చేపట్టి బాలన్స్ షూటింగ్ చేసేస్తున్నాడు.

కారణాలు ఇంకా తెలియలేదు కానీ ప్రస్తుతానికి మగుడం చేతులు మారిపోయింది. అయితే విశాల్ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. డిటెక్టివ్ 2 టైంలో మిస్కిన్ తో అచ్చం ఇలాగే జరిగింది. గొడవ తీవ్రంగా ముదిరిపోయి నువ్వా నేనా అనేసుకున్నారు. కట్ చేస్తే డిటెక్టివ్ 2 నేనే తీస్తానని ప్రకటించిన విశాల్ కంటిన్యూ చేశాడు కానీ ఎందుకనో తర్వాత ఆపేశాడు. ఇప్పటిదాకా దాని అప్డేట్ లేదు. ఇప్పుడు రవి అరసుతో క్రియేటివ్ డిఫరెన్స్ కాస్తా మగుడం మీద ప్రభావం చూపిస్తోంది. తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న విశ్వాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ ని పూర్తి చేశాక పరిశ్రమలో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఈలోగా ఇది జరిగింది.

మగుడంలో దూశారా విజయన్ హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ సంగీతం సమకూర్చగా అంజలి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథా నేపధ్యం లాంటి వివరాలు బయటికి రాలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ కొంచెం ఇంటరెస్టింగ్ గానే అనిపించింది. తెలుగులో మార్కెట్ బాగా తగ్గిపోయిన విశాల్ కు వరస ఫెయిల్యూర్స్ తీవ్ర ప్రభావం చూపించాయి. అభిమన్యుడుతో పుంజుకున్నట్టు అనిపించినా తర్వాత ఫ్లాపులతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మగుడం మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. కమల్ హాసన్ కు క్షత్రియ పుత్రుడులాగా ఇది తనకు స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు.

Related Post

లిటిల్ హార్ట్ మౌళి కోసం ‘కోటి’ ఆఫర్లా?లిటిల్ హార్ట్ మౌళి కోసం ‘కోటి’ ఆఫర్లా?

చిన్న సినిమాగా వచ్చి పెద్ద సెన్సేషన్ గా నిలిచిన లిటిల్ హార్ట్స్ హీరో మౌళి డిమాండ్ మాములుగా లేదు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఏకంగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిందనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌

క‌ర్నూలులో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆద్యంత