hyderabadupdates.com Gallery రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి post thumbnail image

నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం వల్ల రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసేసిందని ఆరోపించారు. డోన్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశార‌ని మండిపడ్డారు. గత ప్రభుత్వం 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టారని, ప్రైవేట్ భూముల్ని ఇష్టానుసారంగా చేశారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింద‌ని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారని పేర్కొన్నారు.
అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని చూశారని అన్నారు సీఎం . ఇదే జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం అని చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారని ఇదెక్క‌డా దేశంలో లేద‌న్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారని, ఈ ఒక్క దాని పిచ్చి కోసం రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారని ఆరోపించారు .
The post రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేర‌కు గురువారం రూ. 5.80

DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్