hyderabadupdates.com movies రెహమాన్ కన్సర్ట్ రెస్పాన్స్ తేడాగా ఉందేంటి

రెహమాన్ కన్సర్ట్ రెస్పాన్స్ తేడాగా ఉందేంటి

నిన్న హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులతో కోలాహల వాతావరణం నెలకొంది. ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా పెద్ది టీమ్ నిలిచింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు ముగ్గురూ హాజరై చికిరి చచికిరి సాంగ్ కొచ్చిన రెస్పాన్స్ పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు. చరణ్ గెటప్, స్వాగ్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈవెంట్ కు హాజరైన జనాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు పాటలు చాలా తక్కువ పాడటం ఒక కారణమైతే మూడు గంటలలోపే మొత్తం ప్రోగ్రాం అయిపోవడం కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి దారి తీసింది.

రెహమాన్ ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు. తెలుగులో ఆయన చేసిన స్ట్రెయిట్ సినిమాలు మ్యూజిక్ పరంగా పెద్దగా అద్భుతాలు చేయలేదు. పల్నాటి పౌరుషం, గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి. అందుకే తమిళ, హిందీకి ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమికుడు, రోజా, బొంబాయి, భారతీయుడు లాంటివి డబ్బింగ్ వెర్షన్లు ఒరిజినల్ తో పోటీ పడేలా ఉంటాయి. అలాంటప్పుడు రెహమాన్ వాటిని తెలుగు సాహిత్యంతోనే పాడవచ్చు. కానీ ఇలా అలవాటు లేకపోవడంతో తక్కువ టాలీవుడ్ సాంగ్స్ తో సరిపెట్టారని నిర్వాహకుల నుంచి వినిపిస్తున్న మాట.

ఓవరాల్ గా చెప్పాలంటే రెహమాన్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ కాలేకపోయిందని సమాచారం. వీరాభిమానులు సంతృప్తి చెందినప్పటికీ మ్యూజిక్ లవర్స్ మాత్రం పలు విషయాల్లో అసంతృప్తికి గురైన వైనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నప్పుడు అంచనాలు ఎక్కువగా ఉండటం సహజం. నూటా యాభై రూపాయల టికెట్, రెండు గంటల సినిమాకే ఎక్కువ హైప్ పెట్టుకునే ప్రేక్షకులు ఇలాంటి ఈవెంట్స్ నుంచి ఇంకా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు అసంతృప్తులు వినిపిస్తాయి. ఇదంతా ఎలా ఉన్నా చికిరి చికిరిని లైవ్ గా స్టేజి మీద పెర్ఫార్మ్ చేయడం పబ్లిక్ ని ఆకట్టుకుంది.

Related Post