hyderabadupdates.com Gallery రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు

రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు

రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న తండ్రి, తెలంగాణ‌కు తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక నీకు లేద‌న్నారు. నీలాగా చిల్లరగా చిలకొట్టుడు కొట్టి బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు త‌ను కాద‌న్నారు. ఉద్యమాల ఉగ్గుపాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఆయన కాలి గోటికి కూడా నువ్వు స‌రిపోవంటూ మండిప‌డ్డారు. కాలం మనది కానప్పుడు తీన్ ఫుట్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా మాట్లాడుతాడంటూ ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నాడు మైక్ కట్ కాబట్టి ఏదైనా వాగుతాడని అన్నారు.
ఇది బడ్జెట్ సెషన్ కాదు.. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషన్ అంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వచ్చుడు వచ్చుడే మోతీలాల్, గోతీలాల్ నెహ్రూని , సోనియా గాంధీని బలిదేవత అని కామెంట్స్ చేసిన విష‌యం మ‌రిచి పోయార‌ని అనుకుంటే పొర‌పాటు పడిన‌ట్లేన‌ని అన్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో ప్రతిపక్షం ఆరు గ్యారంటీల గురించి, పేదల ఇండ్లను విధ్వంసం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాల గురించి నిలదీస్తున్నదని చెప్పారు. రెండు రోజులుగా హస్తినలో అధిష్టానం ముందు అపాయింట్మెంట్ గురించి పడిగాపులు పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి సమాధానం ఇవ్వాల్సింది ఉంద‌న్నారు.
అధికారం కోసం ఇచ్చిన హామీల గురించి, ప్రతిపక్షాలు శాసనసభలో నిలదీసిన ప్రశ్నల గురించి కానీ ప్ర‌స్తావించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రెండేళ్లలో ఈ సర్కారు దోపిడీ ఎంత అన్నది ప్రతిపక్షం ప్ర‌శ్నిస్తోంద‌న్నారు. ఈ సర్కారు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, రైతుల పంటలు ఎందుకు కొనడం లేదని ప్ర‌శ్నించారు.
The post రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడుగ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడు

అమ‌రావ‌తి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కుమరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

తిరుపతి : టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

    మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర