hyderabadupdates.com movies రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న మార్కెట్ ని సరిపోదా శనివారం, హిట్ 3తో బలపరుచుకుని ఆగస్ట్ లో రిలీజయ్యే ది ప్యారడైజ్ తో దాన్ని పీక్స్ కు తీసుకెళ్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో పూర్తిగా ఉంది.

ఇదిలా ఉండగా దీని తర్వాత చేయబోయే మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఓజి ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి బ్లడీ రోమియో టైటిల్ ఫిక్సైయిపోయింది. ఇది గతంలో లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్ గా అధికారిక ముద్ర పడింది. ఇవాళ నాని బర్త్ డేకి చిన్న యానిమేషన్ టీజర్ వదిలారు.

హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో వేరే ఆర్టిస్టుల వాయిస్ ఓవర్ ద్వారా వినిపించారు. అదిరిరిపోయే వంటకు దినుసులు ఎంత ముఖ్యమో వాటిని అద్భుతంగా వాడే చెఫ్ కూడా అంతే అవసరం. అలాగే శత్రువులను తుదముట్టించి మాఫియా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే వాళ్లకు తెగించే మనస్తత్వం, అడ్డొస్తే చంపిపారేసే క్రూరత్వం ఉండాలి.

అలాంటి చేయి తిరిగిన వంటగాడే రోమియో. పేరుకి తగ్గట్టే ఇతనికో ప్రేమకథ కూడా ఉంటుంది. విజువల్స్ లో కిచెన్, సిలిండర్, దానికి బాంబు కట్టడం, రోమియో నాన్ వెజ్ వండటం, బిల్డింగ్ బ్లాస్ట్ అయితే అతనొక్కడే బయటికి రావడం ఇవన్నీ కార్టూన్ స్టైల్ లో చూపించారు.

మొత్తానికి రోమియో రక్తంలో హింస బాగానే ఉండబోతోంది. గ్యాంగ్ స్టర్ అని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి మరో ఓజి లాంటి కంటెంట్ తో సుజిత్ ఏదో మేజిక్ చేయడానికి రెడీ కాబోతున్నారు. వేసవి నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ప్రవీణ్ వైరా దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా ఈ కాన్సెప్ట్ మీద పెద్ద టీమే వర్క్ చేసింది.

వెంకట్ బోయిన్ పల్లి నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీ హీరోయిన్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు వెల్లడించాల్సి ఉంది. దసరా, హిట్ 3 ది థర్డ్ కేస్, సరిపోదా శనివారం, ప్యారడైజ్ ఇలా లైనప్ మొత్తాన్ని ఇంటెన్స్ డ్రామాలతో నింపేస్తున్న నాని బ్లడీ రోమియోతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నాడు.

Related Post

Mahesh Babu’s son Gautam reviews Baahubali: The Epic in US and calls it a ‘goosebumps experience’Mahesh Babu’s son Gautam reviews Baahubali: The Epic in US and calls it a ‘goosebumps experience’

Telugu superstar Mahesh Babu’s son, Gautam Ghattamaneni, recently attended the grand US premiere of SS Rajamouli’s re-edited blockbuster, Baahubali – The Epic. The film, a 3-hour-45-minute version that combines Baahubali:

Buzz: After Sai Marthand, Nithiin holds story discussions with this directorBuzz: After Sai Marthand, Nithiin holds story discussions with this director

Nithiin’s recent outings have turned out to be big failures. He had immense faith in Robinhood and Thammudu, but his calculation went utterly wrong as both failed to deliver as