లెక్క తప్పిన సాయిపల్లవి జాగ్రత్తలు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా మొదలయ్యాయి. ఓపెనింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని ట్రేడ్ పెదవి విరుస్తోంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ప్రమోషన్లు బాగా చేశారు. ముంబై కేంద్రంగా పబ్లిసిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లాల్ సింగ్ చద్దా కోసం హైదరాబాద్ పలుమార్లు తిరిగిన అమీర్ ఈసారి లైట్ తీసుకున్నారు.

సరే దీని సంగతలా ఉంచితే సాయిపల్లవికి సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా ఉంది. 2018లో శర్వానంద్, తను జంటగా ‘పడి పడి లేచే మనసు’ చేసింది. దర్శకుడు హను రాఘవపూడి. భూకంపంలో తన జ్ఞాపకాలు, ముఖ్యంగా ప్రేమించినవాడిని మర్చిపోయే పాత్రలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే డ్రామా శృతి మించిపోవడం, ల్యాగ్ అనిపించే కథనం. పడి పడి లేచే మనసుని డిజాస్టర్ విభాగంలో వేసేశారు.

ఇప్పుడు ఏక్ దిన్ లో సాయిపల్లవి ఒక యాక్సిడెంట్ వల్ల ఒక రోజు గతం మొత్తం మర్చిపోయే మీరా పాత్రను చేసింది. పడి పడి లేచే మనసులో మెమరీ లాస్ ఏడాది కాలానికి పెడితే ఇందులో ఒక్క రోజుకి పరిమితం చేశారు ఆమె కోసం తపించిపోయే హీరోల శర్వా, జునైద్ క్యారెక్టర్లకు కొంచెం దగ్గరి పోలిక కనిపిస్తుంది. అసలు ఏక్ దిన్ కథను ఒక థాయ్ ల్యాండ్ మూవీ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇలా మతిమరుపు హీరో హీరోయిన్లు మనకు కొత్తేమి కాదు.

అందుకే ఏక్ దిన్ కి తక్కువ రెస్పాన్స్ వచ్చిందనేది వాస్తవం. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సాయిపల్లవి ఏక్ దిన్ ఎంచుకోవడం విచిత్రం. ఎంత డబ్బింగ్ చేసినా చాలా బిసి సెంటర్లలో అసలు ఏక్ దిన్ అలియాస్ ఒక రోజు విడుదలే కాలేదు. రామాయణ పార్ట్ 1 చాలా గొప్ప లాంచింగ్ అవుతుందని ఎదురు చూస్తున్న సాయిపల్లవి అతి త్వరలోనే సింగింగ్ లెజెండ్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి బయోపిక్ లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More From Author

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

Peddi Wraps Shoot; Ram Charan’s Pan-India Film Set for June 4 Release