hyderabadupdates.com Gallery లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టాకీ పార్ట్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఒక షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి అవుతుందని సమాచారం.

తాజాగా టీమ్ ఆ చివరి షెడ్యూల్‌ కోసం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్‌లో అఖిల్‌పై యాక్షన్ సీన్స్‌తో పాటు ఒక ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించనున్నారు. సుమారు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా నిర్మించినట్టు తెలుస్తోంది.

ఈ కథ రాయలసీమ నేపథ్యంతో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. అఖిల్, శ్రీలీల జోడీ స్క్రీన్‌పై కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించబోతోందని టాక్. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ బాగుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
The post లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తిSupreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court : దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court) ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం