hyderabadupdates.com movies లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస. 

ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి ఎంత ట్రోలింగ్ జరుగుతూ వచ్చిందో తెలిసిందే. కోహ్లి సారథ్యంలో పుష్కర కాలం పాటు ప్రయత్నించి ఫెయిలైన ఆర్సీబీ.. ఎట్టకేలకు ఈ ఏడాది రజత్ పటిదార్ నాయకత్వంలో కలను నెరవేర్చుకుంది. కోహ్లి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలిచిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, అభిమానుల ఆనందానికి అవధులే లేకపోయాయి.

కానీ ఇంత సాధించి ఏం లాభం? వాళ్ల ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది చనిపోవడంతో ఆనందం ఆవిరైపోయింది. ఆ విషాదం వల్ల ఆర్సీబీ చుట్టూ తీవ్రమైన నెగెటివిటీ ముసురుకుంది. విమర్శలు, ఆరోపణలు, కేసులతో ఆర్సీబీ ప్రతిష్ట మసకబారింది. ఇది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను కూడా దెబ్బ తీసింది. చివరికి ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం జట్టును అమ్మడానికి రెడీ అయిపోయింది.

ఒక టీం కప్పు గెలిస్తే బ్రాండ్ వాల్యూ పెరగడం.. యజమానుల్లో ఇంకా ఉత్సాహం రావడం చూస్తుంటాం. కానీ ‘ఆర్సీబీ’ విషయంలో దీనికి భిన్నంగా జరగబోతోంది. ఆర్సీబీ సేల్ పూర్తయితే.. వచ్చే ఏడాది జట్టు పేరే మారిపోతుంది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అని చెప్పుకోవడానికి ఆర్సీబీనే ఉండదన్నమాట. ఇలా కప్పు గెలవగానే తర్వాతి ఏడాదికి ఆ పేరే లేకుండా పోవడం ఎప్పుడూ జరగలేదు. డెక్కన్ ఛార్జర్స్ విషయంలో కొన్నేళ్ల తర్వాత జరిగింది. ఆర్సీబీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కోహ్లి లాంటి ఆటగాళ్లకు, అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే విషయమే.

Related Post

Review: Mana Shankara Varaprasad Garu – Fun-filled family entertainerReview: Mana Shankara Varaprasad Garu – Fun-filled family entertainer

Movie Name : Mana Shankara Varaprasad Garu Release Date : Jan 12, 2026 123telugu.com Rating : 3.25/5 Starring : Chiranjeevi, Venkatesh, Nayanthara, Catherine Theresa, Sachin Khedekar and Others Director :

ఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయంఇంచ్ కూడా తగ్గొద్దు: చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంపై ఆ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలు, కోటి సంతకాల

వెంకీ లెక్కలు మారుస్తాడా?వెంకీ లెక్కలు మారుస్తాడా?

తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని.. తానే హైలైట్ కావాలని ఆయన ఆలోచించరు. అతి సామాన్యమైన పాత్రలు కూడా చేస్తుంటారు. తన సినిమాల్లో పాత్రకు ఎలివేషన్ తగ్గినా.. పంచులు