hyderabadupdates.com movies వంట గ‌దిలో మొగుడి విధ్వంసం

వంట గ‌దిలో మొగుడి విధ్వంసం

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని వ‌దులుకున్న త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సి.. ఇప్ప‌టికే త‌న‌తో రెండు సినిమాలు చేసిన విశాల్‌తో జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సైలెంటుగా ఆ సినిమాను మొద‌లుపెట్టి కొంత చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిపిన సుంద‌ర్.. స‌డెన్ స‌ర్ప్రైజ్ అన్న‌ట్లుగా ఈ సినిమా టైటిల్ టీజ‌ర్ వ‌దిలాడు. అది చాలా క్రేజీగా సాగి ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇటీవ‌లే రిలీజైన స‌మంత సినిమా మా ఇంటి బంగారం టీజ‌ర్‌తో దీనికి పోలిక ఉండ‌డం విశేషం. పైకి ప‌ద్ధ‌తైన ఇల్లాలిలా క‌నిపిస్తూ… త‌న అత్తారింటిలోనే రౌడీల‌ను మ‌ట్టుబెట్టే పాత్ర‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది స‌మంత‌. సుంద‌ర్ సినిమాలో విశాల్ కూడా ఇలాంటి పాత్రే చేస్తున్న‌ట్లున్నాడు. ఈ సినిమాకు పురుష‌న్ ( తెలుగులో మొగుడు ) అనే టైటిల్ పెట్టిన సుంద‌ర్.. టీజ‌ర్‌తో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యాక్ష‌న్ ప్రియుల‌కూ కావాల్సినంత మ‌సాలా అందించాడు.

ఇంట్లో స‌తీమ‌ణికి సేవ‌లు చేసుకునే ప‌ద్ధ‌తైన భ‌ర్త‌గా విశాల్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసి.. ఇంటికొచ్చిన అతిథికి టీ పెట్ట‌డం కోసం వంట గ‌దిలోకి వెళ్లి అక్క‌డ త‌న మీద దాడికి వ‌చ్చిన రౌడీ బ్యాచ్ బెండు తీసే నేప‌థ్యంలో ఈ టీజ‌ర్ సాగింది. టీజ‌ర్‌ను ఒక‌లా మొద‌లుపెట్టి.. ఇంకోలా ముగించిన తీరు ఆక‌ట్టుకుంది.

సీరియ‌ల్ న‌టుడి పాత్ర‌లో యోగి బాబు పండించిన హాస్యం టీజ‌ర్లో మేజ‌ర్ హైలైట్. విశాల్ ఇల్లాలి పాత్రలో త‌మ‌న్నా క‌నిపించ‌గా.. భ‌ర్త ముందే ఆమెకు యోగిబాబు సైట్ కొట్ట‌డం.. విశాల్‌ను త‌క్కువ‌గా అంచనా వేసిన అత‌ను త‌ర్వాత వంట గ‌దికి వెళ్లి త‌న విధ్వంసాన్ని చూసి షాక‌వ్వ‌డం.. ఈ క్ర‌మంలో అత‌డి వ‌న్ లైన‌ర్స్ కావాల్సినంత వినోదాన్ని పంచాయి.

సుంద‌ర్ అంటే మాస్ అంశాలు, కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్‌. ఐతే త‌న సినిమాలు మ‌రీ రొటీన్‌గా ఉంటాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి. పురుష‌న్ కూడా కొత్తగా అనిపించ‌క‌పోయినా.. మాస్ మెచ్చే యాక్ష‌న్, ఎంట‌ర్టైన్మెంట్‌కు లోటు ఉండ‌ద‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్నాడు. టీజ‌ర్ పూర్త‌య్యాక సుంద‌ర్, త‌మిళ‌, విశాల్ మ‌ధ్య సంభాష‌ణ కూడా ఫన్నీగా సాగడంతో ఈ టీజ‌ర్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

Related Post

కాంత ఆ హీరో కథనా?కాంత ఆ హీరో కథనా?

దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ నటుడే కానీ.. వివిధ భాషల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో అతను పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా తెలుగులో అతను నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ కల్ట్ మూవీస్‌గా పేరు