hyderabadupdates.com movies వరప్రసాద్ గారి వినోదాల విందు

వరప్రసాద్ గారి వినోదాల విందు

సంక్రాంతి రేసులో రాజా సాబ్ తర్వాత ఎక్కువ అంచనాలు మోస్తున్న సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు మీద మెగా ఫ్యాన్స్ ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ హ్యాండిల్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తోడవ్వడంతో ఫన్ ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. చెప్పిన టైంకి ఎలాంటి ఆలస్యం లేకుండా కంటెంట్ వదిలేశారు. పూర్తిగా కాదు కానీ చూచాయగా కథేంటో చెబుతూ, చెప్పీ చెప్పకుండా రివీల్ చేశారు. కొన్ని క్లూస్ మాత్రమే ఇచ్చారు.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఆఫీసర్ వరప్రసాద్ (చిరంజీవి) మాములు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శశిరేఖ (నయనతార) కు దూరంగా ఎందుకు బ్రతికాల్సి వచ్చిందో అంతు చిక్కని రహస్యంగా మారుతుంది. ఈలోగా ప్రభుత్వానికి వరప్రసాద్ తో పని పడుతుంది.

దీంతో మనోడు రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ (వెంకటేష్) కూడా ఎంట్రీ ఇస్తాడు. అసలు గవర్నమెంట్ మిషన్ ఏంటి, ఉద్యోగం, కుటుంబాన్ని వదిలేసి వరప్రసాద్ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, అతని జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన శత్రువులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా దర్శకుడు అనిల్ రావిపూడి తనేం చూపించబోతున్నాడో ఒక ఐడియా అయితే ఇచ్చారు. చిరంజీవి మాస్ లుక్స్ తో పాటు కొంచెం కామెడీ యాంగిల్ ని శాంపిల్ గా చూపించి, చిరు వెంకీల కలయికని ఒక డైలాగుతో బయట పెట్టేశారు.

అయితే ఫ్యాన్స్ లో ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ట్రైలర్ ఉందా అంటే వెంటనే ఎస్ చెప్పలేని పరిస్థితి. ఇంకొంచెం బెటర్ కట్ ఉండాల్సిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. జనవరి 9 రిలీజ్ కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు ఇంకో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించబోతున్నారు.

Related Post

Love Days Glimpse Launch: A Fresh Toxic Love Story Promises Deep EmotionsLove Days Glimpse Launch: A Fresh Toxic Love Story Promises Deep Emotions

Love Days, starring Naveen and Kusuma Chandrika, is gearing up to make its mark as a soulful and intense love story. Produced by Madala Venkata Krishna Prasad under Oncan Entertainments

పాట్లు ప‌డుతున్న కోట్ల పాలిటిక్స్ ..!పాట్లు ప‌డుతున్న కోట్ల పాలిటిక్స్ ..!

ఆయ‌న గతంలో కేంద్ర మంత్రి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే. మరి అప్పట్లో చక్రం తిప్పిన ఆయ‌న ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమేరకు దూసుకుపోతున్నారు? ఏమేరకు నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారు? అనేది కీలకం. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 88 మంది తొలిసారి