hyderabadupdates.com movies వరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడి

వరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడి

ఎల్లుండి తిరుపతిలో మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అనేలా ఫైనల్ కట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మూడు పాటలు మినహాయించి ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియో కంటెంట్ రాలేదు.

అంటే సన్నివేశాలు, డైలాగులు, ఫైట్లు లాంటివి ఏవీ రివీల్ చేయకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఇక్కడిదాకా నెట్టుకొచ్చారు. అటుచూస్తే వందల కోట్లతో తీసిన రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే రెండు టీజర్లు, ఒక ట్రైలర్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల వీడియోని అభిమానులకు చూపించేసింది.

బిజినెస్ ఎంత బాగా జరుగుతున్నా మెగాస్టార్ ఇమేజ్, రావిపూడి బ్రాండ్ మీద ఎంత క్రేజ్ నెలకొన్నా, గ్రౌండ్ లెవెల్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని తాలూకు సౌండ్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ట్రైలర్ లో చూపించే విజువల్స్, కామెడీ యాంగిల్స్, యాక్షన్ బిట్స్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తెరమీద కనిపించి రెండు సంవత్సరాల అయిదు నెలలైపోయాయి. ఇది చాలా ఎక్కువ గ్యాప్. అవతల బాలకృష్ణ ఇదే టైంలో దూసుకుపోయారు. అఖండ 2 టాక్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత వసూళ్లు తెస్తూనే ఉండటానికి కారణం బాలయ్య స్క్రీన్ కంటిన్యూటీ మెయిన్ టైన్ చేయడం.

సో ఇప్పుడు ఒక్కసారిగా మన శంకరవరప్రసాద్ గారు మీద హైప్ పెరిగిపోవాలంటే ఆ మేజిక్ చేసే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే అనిల్ రావిపూడి ఏదీ దాచకుండా మెయిన్ లైన్ రివీల్ చేశారని, చిరు నయన్ ప్రేమ,పెళ్లి, విడాకులతో పాటు ఫ్యామిలీ సెటప్, విలన్ గ్యాంగ్ వ్యవహారం లాంటివన్నీ చూపించబోతున్నారట.

ముఖ్యంగా మెగాస్టార్ స్వాగ్ చూపించే కీలకమైన క్లిప్స్ ఇందులో పొందుపరిచారని తెలిసింది. అదే నిజమైతే మటుకు ట్రైలర్ మీదున్న మెగా ఒత్తిడి పాజిటివ్ గా మారిపోయి అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా టార్గెట్ చేసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తే లక్ష్యం నెరవేరినట్టే.

Related Post

డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదుడీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

4 Malayalam Films to Watch on OTT This Week: Sandeep Pradeep’s Eko to Innocent4 Malayalam Films to Watch on OTT This Week: Sandeep Pradeep’s Eko to Innocent

Cast: Althaf Salim, Anarkali Marikkar, Azeez Nedumangad, Joemon Jyothir, Aswin Vijayan, Anna Prasad, Naju Mudheen Director: Satheesh Thanvi Genre: Family Comedy Drama Runtime: 2 hours and 8 minutes Where to

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్ లాంటి క‌ల్ట్ మూవీస్‌తో ఇండియ‌న్ సినిమానే ఒక ఊపు ఊపేశాడు. వ‌ర్మ స్ఫూర్తితో సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వాళ్లకు లెక్క