hyderabadupdates.com Gallery వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి

వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి

వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి post thumbnail image

విజయవాడ : వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని, సత్వరమే కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు తో పాటు , మీడియా స్వేచ్ఛ‌ను కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకు రావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జేయూ) అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు . తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులకు వేతన సవరణలు జరగలేదని, దీంతో వారి పరిస్థితి అసంఘటిత రంగం కార్మికుల కంటే దారుణంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగంలో 4 వ స్థంభంగా పిలిచే మీడియా నేడు ముక్కలు అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కేంద్రం రద్దు చేసిందన్నారు. జర్నలిస్టులను దిగజార్చడానికే నేషనల్ మీడియా కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు.
ఆర్ ఎన్ ఐ ను మార్చివేసి పి ఆర్ జి ఐ ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు శ్రీ‌నివాస్ రెడ్డి. బలమైన, స్వతంత్ర విధానం లేకుండా ప్రజాస్వామ్యం సజావుగా నడవదన్నారు. దురదృష్టవశాత్తు, మీడియాను కేవలం నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వ్యవస్థ పూర్వకంగా నియంత్రిస్తున్నారని వాపోయారు. పని గంటలు, నైట్ డ్యూటీ నియమాలు వంటి ప్రాథమిక అంశాలను యాజమాన్యాలు తరచుగా పట్టించు కోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిజిటల్ (సోషల్) మీడియా ఒత్తిడితో సాంప్రదాయ మీడియా క్షీణిస్తోందని, పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రేక్షకాదరణ కోసం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
The post వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనంశ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం

తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా

వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దువ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు

న్యూఢిల్లీ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మ‌న్ జే షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది కొన్ని జ‌ట్లు లేకుండా ఎలా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌శ్నించార‌ని, ఆపై దుష్ప్ర‌చారం చేసేందుకు య‌త్నించార‌ని అన్నారు.

ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి హౌస్ అరెస్ట్ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి హౌస్ అరెస్ట్

నిజామాబాద్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి ఎవ‌రు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే తేల్చుకుందాం