hyderabadupdates.com movies వాయిదాల వర్షంలో అలియా భట్ సినిమా

వాయిదాల వర్షంలో అలియా భట్ సినిమా

దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ తిరస్కరిస్తారోననే ఇన్ సెక్యూరిటీ అక్కడి దర్శక నిర్మాతలకు పెరిగిందన్న మాట వాస్తవం. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన అల్ఫా గత ఏడాది డిసెంబర్ 25 విడుదల కావాల్సింది. అలియా భట్, వామికా గబ్బి లేడీ గూఢచారులుగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ తదితర కారణాల వల్ల క్రిస్మస్ కు రాలేకపోయింది. సరే కొత్త డేట్ అంటూ తర్వాత ఏప్రిల్ 17 అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్ల హడావిడి లేకపోవడంతో జనాలకు డౌట్ వచ్చింది. తాజాగా జూలై 10కి మరోసారి పోస్ట్ పోన్ చేస్తూ కొత్త ప్రకటన ఇచ్చారు. అంటే ముచ్చటగా మూడోసారి మారిందన్న మాట. ఇలా చేయడానికి కారణాలు చాలా సింపుల్.

దురంధర్ రివెంజ్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాని ప్రభావం ఎంతలేదన్నా నెల నుంచి యాభై రోజుల దాకా ఉంటుంది. అలాంటప్పుడు మధ్యలో అల్ఫా వస్తే లేనిపోని పోలికలతో ఇబ్బంది తలెత్తుతుంది. దురంధర్ వచ్చినప్పటి నుంచి నెటిజెన్లు టార్గెట్ చేస్తోంది యష్ సంస్థ తీసిన టైగర్, వార్, పఠాన్ లాంటి స్పై సినిమాలనే. ఇప్పుడు అల్ఫాకు ఇదే ఇబ్బంది రావొచ్చని భావించి నిర్ణయం మార్చుకున్నారట.

ఏది ఏమైనా అలియా భట్ మూవీకి ఇంత కష్టం రావడం విచిత్రమే. ఇంతకు ముందులా జనాలు స్పై సినిమాల్లో ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు, బికినీ పాటలు ఇష్టపడటం లేదు. దీన్ని మార్చిన ఘనత దురంధర్ కే దక్కుతుంది. అల్ఫాలో అలాంటివి ఉన్నాయో లేదో ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం.

యష్ స్పై యునివర్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, టైగర్ శ్రోఫ్, అలియా భట్, వామికా గబ్బి ఇలా అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి అవెంజర్స్ తరహాలో ఒక మెగా మూవీ తీయాలనేది ఆదిత్య చోప్రా కోరిక. కానీ బాక్సాఫీస్ ఫలితాలు, తాజా పరిణామాలు చూస్తుంటే అదంతా సులభంగా నెరవేరేలా లేదు.

Related Post

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటిమగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక పలు సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా మగాళ్లను కుక్కలతో పోలుస్తూ ఆమె

Pallichattambi Postponed Again? Tovino Thomas, Kayadu Lohar’s film to hit theaters on Vishu 2026Pallichattambi Postponed Again? Tovino Thomas, Kayadu Lohar’s film to hit theaters on Vishu 2026

More about Pallichattambi Set in Kerala between the 1950s and early 1960s, Pallichattambi explores the story of a young ruffian hired by villagers to oppose tyrannical forces disrupting their peaceful