hyderabadupdates.com movies ‘వారణాసి’ గొడవని ఎలా పరిష్కరిస్తారు

‘వారణాసి’ గొడవని ఎలా పరిష్కరిస్తారు

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ జరగడానికి కొద్దిరోజుల ముందు వారణాసి అనే పేరుతో ఒక సినిమా పోస్టర్ అధికారికంగా రిలీజయ్యింది. చాలా మంది దీన్ని లైట్ తీసుకున్నారు. బహుశా రాజమౌళి వేరే పేరు పెట్టుకున్నారేమో అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఎస్ఎస్ఎంబి 29 నామకరణం వారణాసినే అయ్యింది. అయితే ఇప్పుడీ టైటిల్ వివాదానికి దారి తీసేలా ఉంది. రామభక్త హనుమ క్రియేషన్స్ అనే బ్యానర్ ఈ పేరుని ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసినట్టుగా పక్కా ఆధారంతో ఒక లెటర్ ని విడుదల చేసింది. అందులో స్పష్టంగా ఈ ఏడాది జూలై 24 నుంచి వచ్చే సంవత్సరం జూలై 23 దాకా టైటిల్ వారిదేనని ఉంది.

ఒకవేళ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోవాలంటే అప్పటిదాకా షూటింగ్ జరిగినట్టు తగిన ఆధారాలు, ప్రమోషన్ మెటీరియల్స్ వగైరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు పునరుద్ధరణ చేస్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే లీగల్ గా వారణాసి టైటిల్ లేఖ విడుదల చేసిన సంస్థదే. కానీ జక్కన్న టీమ్ తెలివిగా ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసి అని ట్రైలర్ చివర్లో రివీల్ చేసింది. నైతికంగా ఇది కరెక్ట్ కాదని కొందరి వాదన. గతంలో ఇలాంటి కాంట్రావర్సిలు వచ్చాయి. అప్పుడా టైటిల్స్ కాస్తా కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ బాబు ఖలేజా, నాని గ్యాంగ్ లీడర్ గా మారిపోయాయి. ఇప్పుడూ అదే జరిగే సూచనలున్నాయి.

ఆది సాయికుమార్ తో గతంలో రఫ్ తీసిన సిహెచ్ సుబ్బారెడ్డి పైన చెప్పిన ఫస్ట్ వారణాసికి దర్శకుడు. ఇది కూడా సనాతన ధర్మం, కాశి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నదే. కాకపోతే గ్రాండియర్, బడ్జెట్, క్యాస్టింగ్ విషయాల్లో దాంతో సరితూగదు. దీని పట్ల నిర్మాతలు కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఎలా స్పందిస్తారో చూడాలి. మేం రాజమౌళిస్ అని పెట్టాం అని లాజిక్ చెబుతారో లేక తెరవెనుక రాజీ ప్రయత్నాలు ఏమైనా చేస్తారో చూడాలి. ఎందుకంటే జక్కన్నకు ఇప్పుడు పేరు మార్చే ఛాన్స్ లేదు. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి ఆ పేరు చొచ్చుకుపోయింది. మరి పైన చెప్పిన సదరు టీమ్ కాంప్రోమైజ్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ.

Related Post

సందీప్ వంగా కెమెరాలో చిరు కనిపిస్తేసందీప్ వంగా కెమెరాలో చిరు కనిపిస్తే

అర్జున్ రెడ్డి, యానిమల్ తో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్ స్పిరిట్ మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే దీని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేశాయి.

Nandamuri Balakrishna: The power &valor of Sanatana Hindu Dharma can be seen in Akhanda 2Nandamuri Balakrishna: The power &valor of Sanatana Hindu Dharma can be seen in Akhanda 2

The first single “The Thaandavam” from the highly anticipated Akhanda 2: Thaandavam, starring God of the Masses Nandamuri Balakrishna and directed by blockbuster-maker Boyapati Sreenu with music by S. Thaman,