తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. మేక తలకాయ పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు.
రాజకీయ ముసుగులో జగన్ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. జంతు బలిలో పాల్గొన్నవారు ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు.. ఫ్యాక్షన్ సినిమా చూసినట్లుగా వైసీపీ వికృత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. జగన్ ఆదేశాలతోనే ఈ తరహా కార్యక్రమాలు జరిగాయా? అని ప్రశ్నించారు. గర్భిణీని కాలుతో తన్నే ఉన్మాదులను ఏమనాలి అన్నారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం అడ్డం పెట్టుకుని కుట్ర జరుగుతుందని, తల్లిదండ్రులు యువత భవిష్యత్తుపై ఆలోచన చేయాలన్నారు.
రప్పా రప్పా డైలాగులు టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర ఆరోపణలకు దారి తీసాయి. అధికారంలో ఉంటే పీకలు కోయడం, దాడులు చేయడాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారం పోయాక కూడా రప్పా రప్పా గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరికితే తప్పేంటి అంటున్నారు.
హింసను, దాడులను అధినేత ప్రోత్సహిస్తుండడంతో, వైసీపీ శ్రేణులు గంజాయి మత్తులో మారణాయుధాలతో రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నారని మండిపడ్డారు.