hyderabadupdates.com Gallery విజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాం

విజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాం

విజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాం post thumbnail image

విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివ‌నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్‌ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలు, ఎత్తుపల్లాలను అతి తక్కువ సమయంలో సరిచేసే సామర్థ్యం ఉండటం ఈ మిషన్ ప్రత్యేకత అని తెలిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో తారు ను అధిక ఉష్ణోగ్రతకు కాల్చి రోడ్డు వేయాల్సి ఉండగా, ఈ ఇన్‌ఫ్రారెడ్ మిషన్‌లో అలాంటి కాలుష్యకర ప్రక్రియ అవసరం లేకుండా, పాత తారును అదే ఉష్ణోగ్రతలో రీసైక్లింగ్ చేసి కొత్త తారుతో సమానంగా ఉపయోగించు కోవచ్చని అన్నారు ఎంపీ. దీంతో 98 శాతం వరకు కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం నగరానికి రూ.25 కోట్ల గ్రాంట్ మంజూరైనప్పటికీ, మొత్తం రూ.32 కోట్ల వరకు గ్రాంట్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రూ.32 కోట్ల గ్రాంట్‌కు అవసరమైన యంత్ర సామగ్రి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు అందుతుందని ఎన్‌క్యాప్ అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని నగరానికి రావాలని, తద్వారా రోడ్ల పరిస్థితి మెరుగుపడి పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ చెప్పారు.
ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రీన్ డెవలప్‌మెంట్ మిషన్లను ప్రోత్సహిస్తున్న ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేయడంలో అనుభవం కలిగిన నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసించారు.
The post విజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ ఆస‌క్తిక‌ర , స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. సోమ‌వారం ఏపీని ద‌ర్శించారు బిల్ గేట్స్. త‌న‌కు గ్రాండ్ వెల్ కం ల‌భించింది.

MBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదంMBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదం

    వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు ఎన్ఎంసీ శుభవార్త చెప్పింది. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి.

PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీPM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ

Narendra Modi : దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. దేశంలో మావోయిస్టు ప్రభావితజిల్లాల సంఖ్య గత 11 ఏళ్లలో 125 నుంచి మూడుకు