hyderabadupdates.com movies విజయ్ చేయాల్సిన సినిమా సూర్య చేశాడు

విజయ్ చేయాల్సిన సినిమా సూర్య చేశాడు

తమిళంలో చాలా ఏళ్లు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉన్నాడు. రజినీ ఉండగా ఆయన్ని కొట్టే హీరో ఇంకొకరు రారనే అంతా అనుకున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు మారిపోయాయి. విజయ్.. రజినీని మించి పెద్ద హీరోగా ఎదిగిపోయాడు. అలాంటి హీరోతో సినిమా చేసే అవకాశం అంటే ఏ దర్శకుడైనా వదులుకుంటాడా?

కానీ విజయ్ కోరుకున్నట్లుగా స్క్రిప్టును మార్చి, ఆయన చెప్పిన టైంలైన్లో సినిమా చేయలేని పరిస్థితుల్లో తాను ఆ అవకాశం వదులుకున్నట్లు చెబుతున్నాడు ఆర్జే బాలాజీ. తమిళంలో రేడియో జాకీగా పాపులరిటీ సంపాదించి.. ఆ తర్వాత నటుడిగా మారిన బాలాజీ.. కొన్నేళ్ల కిందట ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం సక్సెస్ అయింది. తర్వాత అతను విజయ్ కోసం ఒక కథ రెడీ చేశాడట.

2023లో విజయ్‌ని కలిసి ఆ కథ చెబితే.. అతడికీ నచ్చిందట. ఈ కథను ఇంకొంచెం వినోదాత్మకంగా మార్చమని అడిగాడట విజయ్. అంతేకాక రాజకీయాల్లోకి వెళ్లే ముందు తనకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో చకచకా ఆ ప్రాజెక్టును చేసేద్దామని కూడా చెప్పాడట. కానీ తాను విజయ్ కోరుకున్నంత వేగంగా సినిమా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయానని బాలాజీ తెలిపాడు.

ఐతే విజయ్‌తో కలిసి కథా చర్చలు జరిపిన సమయంలో కథలో ఇంకొన్ని మంచి మార్పులు జరిగాయని.. తర్వాత ఈ స్క్రిప్టునే తీసుకెళ్లి సూర్యకు చెబితే ఆయన వెంటనే ఓకే చేశాడని తెలిపాడు. ఆ చిత్రమే ‘కరుప్పు’ అని బాలాజీ వెల్లడించాడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ‘కరుప్పు’ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ‘మూకుత్తి అమ్మన్’ సీక్వెల్‌‌కు తాను కాకుండా సుందర్ దర్శకత్వం వహిస్తుండడం గురించి బాలాజీ స్పందిస్తూ.. తనకు ఆ మూవీకి సీక్వెల్ చేసే ఉద్దేశం లేదని, కానీ నిర్మాతలు సుందర్ దర్శకత్వంలో సీక్వెల్ చేయాలనుకుని తనకు చెబితే.. సరే అన్నానని చెప్పాడు.

Related Post

Paapi Paapi Song Sparks Buzz Ahead of Gurram Paapireddy ReleasePaapi Paapi Song Sparks Buzz Ahead of Gurram Paapireddy Release

The makers of Gurram Paapireddy have unveiled the film’s promotional song titled “Paapi Paapi”, giving audiences a lively glimpse into the movie’s quirky and darkly comic world. With its energetic