ముంబై : ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని పేర్కొంది. తాజాగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ అంటే ఇష్టమని, అయితే తనకు ఇష్టమైన జాబితాలో మరికొందరు నటులు కూడా ఉన్నారంటూ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ.
తన రాబోయే తెలుగు మూవీ యుఫోరియా ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చారు. ట్రైలర్ సందర్బంగా స్పందిస్తూ ఇలా అన్నారు. ఈ యువ నటి ప్రేక్షకులను తెలుగులో పలకరించింది. అందరినీ ఆకట్టుకుంది. మీకందరికీ నమస్కారం అంటూనే ప్రేమ పూర్వకంగా పిలవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా సంతోషానికి లోనయ్యారు. చప్పట్లతో స్వాగతించారు.
మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు అందరికంటే ముందుంటారని ప్రశంసలు కురిపించారు సారా అర్జున్. గొప్ప సంస్కృతికి, ఆప్యాయతకు మీరు దర్పణంగా నిలుస్తారంటూ పేర్కొన్నారు ఈ యువ నటి. యుఫోరియాలో నటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు సారా అర్జున్. తన జీవితంలో మరిచి పోలేని అనుభూతిని ధురంధర్ మూవీ మిగిల్చిందని పేర్కొన్నారు. తన సినీ కెరీర్ లో ఇలాంటి పాత్ర భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదన్నారు. ఈ లవ్లీ బ్యూటీ తెలుగులో పలకరించడం, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రస్తుతం తెలుగు సినిమా రంగంతో పాటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
The post విజయ్ దేవరకొండ అంటే ఇష్టం : సారా అర్జున్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
విజయ్ దేవరకొండ అంటే ఇష్టం : సారా అర్జున్
Categories: