hyderabadupdates.com Gallery విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్టం : సారా అర్జున్

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్టం : సారా అర్జున్

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్టం :  సారా అర్జున్ post thumbnail image

ముంబై : ధురంధ‌ర్ హీరోయిన్ సారా అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్టం అని పేర్కొంది. తాజాగా త‌ను చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. విజ‌య్ అంటే ఇష్ట‌మ‌ని, అయితే త‌నకు ఇష్ట‌మైన జాబితాలో మ‌రికొంద‌రు న‌టులు కూడా ఉన్నారంటూ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ‌.
త‌న రాబోయే తెలుగు మూవీ యుఫోరియా ప్ర‌చారం కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ట్రైల‌ర్ సంద‌ర్బంగా స్పందిస్తూ ఇలా అన్నారు. ఈ యువ న‌టి ప్రేక్ష‌కుల‌ను తెలుగులో ప‌ల‌క‌రించింది. అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మీకంద‌రికీ న‌మ‌స్కారం అంటూనే ప్రేమ పూర్వ‌కంగా పిల‌వ‌డంతో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా సంతోషానికి లోన‌య్యారు. చ‌ప్ప‌ట్లతో స్వాగ‌తించారు.
మంచి సినిమాల‌ను ఆద‌రించ‌డంలో తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రికంటే ముందుంటార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు సారా అర్జున్. గొప్ప సంస్కృతికి, ఆప్యాయత‌కు మీరు ద‌ర్ప‌ణంగా నిలుస్తారంటూ పేర్కొన్నారు ఈ యువ న‌టి. యుఫోరియాలో న‌టించ‌డం ప‌ట్ల ఆనందంగా ఉంద‌న్నారు సారా అర్జున్. త‌న జీవితంలో మ‌రిచి పోలేని అనుభూతిని ధురంధ‌ర్ మూవీ మిగిల్చింద‌ని పేర్కొన్నారు. త‌న సినీ కెరీర్ లో ఇలాంటి పాత్ర భ‌విష్య‌త్తులో వ‌స్తుందో లేదో తెలియ‌ద‌న్నారు. ఈ ల‌వ్లీ బ్యూటీ తెలుగులో ప‌ల‌క‌రించ‌డం, విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం ప్ర‌స్తుతం తెలుగు సినిమా రంగంతో పాటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
The post విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్టం : సారా అర్జున్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులురూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు

అమ‌రావ‌తి : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం క‌లిగిన ఏపీలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో అభివృద్దితో ప‌రుగులు పెడుతోంది ఏపీ. ఇందులో భాగంగా అన్ని రంగాలు ముఖ్య భూమిక‌ను పోషిస్తున్నాయి. ఈ మేర‌కు ఏపీ ట్రాన్స్ కో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈఏడాది

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly : యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ (Celina Jaitly) భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. ఆ పోస్టులో..

శేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నంశేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహ నసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద