hyderabadupdates.com movies విజయ్ ప్రచారంలో కుటుంబ ప్రస్తావన

విజయ్ ప్రచారంలో కుటుంబ ప్రస్తావన

ఈ ఏడాది సంక్రాంతికి తమిళనాట బాక్సాఫీస్ మోతెక్కిపోతుందని ఆశిస్తే.. పూర్తిగా కళ తప్పింది. అందుక్కారణం.. విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదల కాకపోవడం. జనవరి 9కి షెడ్యూల్ అయిన ఆ సినిమా.. సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. వాయిదా రెండు మూడు రోజులే ఉంటుందని అనుకుంటే.. నెలల తరబడి అది విడుదలకే నోచుకోలేదు. తమిళనాట ఎన్నికలు అయ్యే వరకు ఆ సినిమా రాదని స్పష్టం అయిపోయింది.

‘జననాయగన్’ విడుదల కాకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నది విజయ్ అభిమానుల ఆరోపణ. ఐతే విజయ్ మాత్రం దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఐతే ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో విజయ్.. తాజాగా ‘జననాయగన్’ ప్రస్తావన తెచ్చాడు. ఈ సినిమాను కుట్రపూరితంగా నిషేధించారంటూ ఆయన చాలా ఆవేశంగా మాట్లాడ్డం గమనార్హం.

తాజాగా ఎన్నికల ప్రచారంలో ‘జననాగయన్’ గురించే కాక.. తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన ఆరోపణలు, విమర్శల గురించి కూడా విజయ్ ప్రస్తావించాడు. ‘జననాగయన్’ సినిమాను నిషేధిస్తే తాను డిస్టర్బ్ అయిపోతారని అనుకున్నారని, కానీ తాను ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటే జీర్ణించుకోలేకపోయారని విజయ్ వ్యాఖ్యానించాడు.

‘జననాయగన్’ను ఆపింది ఎవరో తెలుసని విజయ్ పేర్కొన్నాడు. మరోవైపు తనను అడ్డుకోవడం కోసం తనకు మాత్రమే ప్రత్యేకంగా ‘ఎస్ఓపీ’ తీసుకొచ్చి.. రకరకాల నిబంధనలు పెట్టారని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిగతా పార్టీలకు మాత్రం ఏ షరతులూ లేవని.. తనను మాత్రం బయటికి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని.. అప్పుడు కూడా తాను ఆగలేదని విజయ్ చెప్పాడు.

ఇవన్నీ సరిపోవని తన చుట్టూ ఉన్న వాళ్లను ఉపయోగించుకుని, ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది ఎన్నికలకు 30 రోజుల ముందు తన మీద ఆరోపణలు చేయించారంటూ పరోక్షంగా తన భార్య విడాకుల కోసం పిటిషన్ వేయడం గురించి ప్రస్తావించాడు విజయ్. కానీ తాను ఇలా ఎన్ని చేసినా ఆగలేనని.. ఎవరూ తనను ఆపలేరని.. జనం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని విజయ్ స్పష్టం చేశాడు.

Related Post

Since We’re Reliving 2016, Here Are Some Things We’d Love To Bring Back In 2026Since We’re Reliving 2016, Here Are Some Things We’d Love To Bring Back In 2026

Somewhere between blockbusters Rockstar and Jab We Met reruns popping back into our cinema watchlists, a Charlie Puth video casually captioned “Heard it was 2016 again?”, and grainy photo dumps