అయ్యప్ప భక్తులు ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక వీడియో విడుదల చేశారు. ‘మన దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున భక్తులు మాల ధరించి శబరిమల వెళుతుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత, విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ నిబంధనలో మార్పులు చేసి నేరుగా ఇరుముడి తీసుకువెళ్లే విధానాన్ని అనుమతించాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది.ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ‘ అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు వెళుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి, 41 రోజుల కఠిన దీక్ష తర్వాత యాత్రకు వెళతారు. కార్తీక మాసం, సంక్రాంతి సమయాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేరళతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు.
స్వామియే శరణం అయ్యప్ప!శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి… pic.twitter.com/QT6JGV45Ng— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 28, 2025