hyderabadupdates.com movies ‘విరోష్’ వేడుక.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే

‘విరోష్’ వేడుక.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే

ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే. వీళ్లిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్. ముఖ్యంగా బహు భాషల్లో సినిమాలతో నేషనల్ క్రష్ అని గుర్తింపు కూడా సంపాదించింది రష్మిక. విజయ్ చేసిన తెలుగు సినిమాలే వేరే భాషల్లోనూ గుర్తింపు సంపాదించాయి. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అందరి దృష్టీ అటు వైపు నిలిచింది. 

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక.. వివాహానంతరం షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. అవి మామూలుగా వైరల్ కాలేదు. పెళ్లి అయ్యే వరకు గోప్యత పాటించిన విజయ్, రష్మిక.. ఆ తర్వాత మాత్రం బాగా ఓపెన్ అయిపోయారు. తమ స్వస్థలం మహబూబ్ నగర్‌కు వెళ్లి రష్మికతో కలిసి అక్కడ పూజలు, వేడుకల్లో పాల్గొనడమే కాక.. ఊరు మొత్తానికి భారీ విందు భోజనాలు ఏర్పాటు చేయించాడు విజయ్. 

ఇప్పుడిక హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు రంగం సిద్ధమైంది. దీన్ని భారీ స్థాయిలోనే చేస్తున్నప్పటికీ.. ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. చాలా జాగ్రత్తగా అతిథుల జాబితా రెడీ చేయించి.. అందరికీ ఆహ్వానాలు పంపడమే కాక, ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. పెళ్లికి వచ్చేవాళ్లు ఎంట్రీ పాయిట్ దగ్గర క్యూఆర్ కోడ్‌తో స్కానింగ్ అయ్యాకే లోపలికి వెళ్లాలని షరతు పెట్టారు. ఐతే సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ కచ్చితంగా ఈ షరతేమీ వర్తించకపోవచ్చు. 

కానీ ఇన్విటేషన్ లేని వాళ్లు లోపలికి రాకుండా చూడడానికే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సర్వేలెన్స్‌లో ఈ వేడుక జరగనుందని.. ఇన్విటేషన్ ఉన్నట్లుగా ధ్రువీకరించే క్యూఆర్ కోడ్ లేకపోతే దయచేసి ఈ వేడుకకు రావొద్దని ‘విరోష్’ జోడీ స్పష్టంగా మీడియాకు నోట్ కూడా ఇచ్చింది.

పెళ్లి లాగే ఈ వేడుకకు కూడా మీడియాను దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీడియాను పిలిచినా సెలక్టివ్‌గానే ఉండొచ్చు. బుధవారం రిసెప్షన్ జరగనుండగా.. అక్కడికి అభిమానుల సందోహం రాకుండా ముందు రోజే విజయ్, రష్మిక ఫ్యాన్స్ మీట్‌ను కూడా పూర్తి చేయడం విశేషం.

Related Post

Nandamuri Balakrishna: The power &valor of Sanatana Hindu Dharma can be seen in Akhanda 2Nandamuri Balakrishna: The power &valor of Sanatana Hindu Dharma can be seen in Akhanda 2

The first single “The Thaandavam” from the highly anticipated Akhanda 2: Thaandavam, starring God of the Masses Nandamuri Balakrishna and directed by blockbuster-maker Boyapati Sreenu with music by S. Thaman,

Baramulla Review: A bold idea that picks pace after a slow beginningBaramulla Review: A bold idea that picks pace after a slow beginning

Story Children mysteriously start disappearing from a region called Baramulla, and a police officer is assigned to investigate the case. While chasing leads and trying to understand what’s really happening,