hyderabadupdates.com movies వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా, కేవలం సెక్స్ కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తూ కొందరు పెళ్లయిన ప్రియురాళ్లు చేస్తున్న ఘాతుకాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో నాలుగు ఘటనలు ఇలాంటివే వెలుగు చూడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయా ఘటనలు వేర్వేరుగా ఉన్నా, అందరి లక్ష్యం వివాహేతర సంబంధమే కావడం గమనార్హం.

1) తమ్ముడితో కలిసి భర్త హత్య

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఓ భార్య, తన భర్తను సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ప్రకాశం జిల్లాలోని దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను, ఝాన్సికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలిసిన శ్రీను, తాను ప్రస్తుతం గంజాయి కేసులో రిమాండ్‌లో ఉన్నానని, బయటకు వస్తే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే ఝాన్సీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే బదులు భర్తనే హతమార్చేలా ప్లాన్ చేసింది. తమ్ముడితో కలిసి సుపారీ గ్యాంగుకు డబ్బులు ఇచ్చి, బెయిల్‌పై బయటకు తెచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది.

2) బిర్యానీలో మత్తిచ్చి

తన వివాహేతర సంబంధాన్ని భర్త పసిగట్టాడని భావించిన గుంటూరుకు చెందిన ఓ మహిళ, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత పథకం ప్రకారం హత్య చేసింది. భర్త శారీరకంగా బలంగా ఉండటంతో మత్తు టాబ్లెట్లు తెప్పించుకుని, భర్తకు ఇష్టమైన బిర్యానీలో వాటిని కలిపింది.

ఆ తర్వాత మత్తు మందులు అందించిన ఆర్ ఎం పీ వైద్యుడు, ప్రియుడు, ఈమె కలిసి భర్తను గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన కూడా శనివారమే వెలుగులోకి వచ్చింది.

3) ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ

ఇది మరో షాకింగ్ ఘటన. కర్నూలుకు చెందిన ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు వృత్తిరీత్యా వైద్యుడు. కొన్నాళ్లకు అతడు మరో యువతిని, ఆమె కూడా వైద్యురాలే, వివాహం చేసుకున్నాడు. దీంతో కోపం, కసితో యువతి అతడి భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసింది.

“నావాడు నాకే సొంతం” అంటూ ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగింది. వైద్యురాలు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ప్రియుడి ప్రియురాలు మరో వాహనంతో ఢీకొట్టించి రోడ్డుపై పడేసింది. అనంతరం 108కు ఫోన్ చేసి, ఆమెను లోపలికి ఎక్కిస్తున్న సమయంలో హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన కూడా శనివారమే వెలుగు చూసింది.

4) ప్రియుడి భార్యకు నిప్పు

తనకు, ప్రియుడికి మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అతడి భార్య అడ్డు వస్తోందని భావించిన ఓ పెళ్లయిన మహిళ, గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రియుడి ఇంటికి నిప్పంటించింది. ఈ ఘటన శనివారం జరిగింది. ఇంటికి నిప్పంటించిన సమయంలో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఇంట్లోనే ఉన్నారు.

ఈ ఘటనలో మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. మొత్తంగా ఒకే రోజు నాలుగు ఘటనలు జరగడం, అవన్నీ వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉండటం ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

Related Post

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది హీరోలు, నిర్మాత‌లు మ‌రే ఫ్యామిలీలోనూ లేరు. ఇప్ప‌టికే ఆ కుటుంబంలో ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. అల్లు అర‌వింద్ ఎప్ప‌ట్నుంచో

జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయిజగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడిదెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా విభిన్నంగా ఉంటుంది. కేవలం హిట్లు కొట్టడమే కాదు, వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోలను తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురావడంలో ఆయనకు