hyderabadupdates.com movies విశ్వక్‌ మంచి కోరుకున్న అర్జున్

విశ్వక్‌ మంచి కోరుకున్న అర్జున్

కొన్నేళ్ల ముందు త‌మిళ సీనియ‌ర్ న‌టుడు అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్.. షూటింగ్ మొదలైన రోజు గైర్హాజరు కావడమే కాక, ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద పెద్ద వివాద‌మే న‌డిచింది. అర్జున్ హైద‌రాబాద్‌కు వ‌చ్చి మ‌రీ ఈ విషయమ్మీద ప్రెస్ మీట్ పెట్టి విశ్వ‌క్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశాడు.

ఎప్పుడూ కూల్‌గా ఉండే అర్జున్‌.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అలా మాట్లాడాడంటే ఏదో పెద్ద విభేదమే ఏర్పడిందని అందరికీ అర్థమైంది. ఐతే తాను ఏ స్థితిలో ఆ సినిమా నుంచి బ‌య‌టికి రావాల్సి వ‌చ్చిందో విశ్వ‌క్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అర్జున్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అనుకున్నారు.. కానీ కొంచెం గ్యాప్ తర్వాత పట్టాలెక్కించాడు. అదే.. సీతాపయనం.

విశ్వక్‌తో చేయించాలనుకున్న పాత్రకు నిరంజన్ అనే కొత్త కన్నడ నటుడిని తీసుకున్నాడు అర్జున్. ఈ సినిమా వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది.విశేషం ఏంటంటే.. విశ్వక్ కొత్త సినిమా ఫంకీ సైతం ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విశ్వక్ సినిమా, విశ్వక్ వదిలేసుకున్న సినిమా బాక్పాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడబోతున్నాయన్నమాట. ఐతే ఇప్పటికీ విశ్వక్ మీద అర్జున్‌కు కోపం ఉందా అన్నది ఆసక్తికరం. కానీ అదేమీ లేదంటూ ఒక ఇంటర్వ్యూలో పాజిటివ్ కామెంట్స్ చేశాడు అర్జున్.

ఈ గొడవ విషయంలో ఏం జరిగింది అని అడిగితే.. ‘‘అప్పుడు ఏం జరిగింది అంటే అదొక చరిత్ర. కొన్నిసార్లు ఏవో కారణాల వల్ల కొన్ని విషయాలు జరగవు. మళ్లీ వాటిని తవ్వుకుని లాభం లేదు. నేను మళ్లీ గతంలోకి వెళ్లను. గతం గత: అనుకుని ముందుకు వెళ్లిపోతుంటా. లేకపోతే మనం ముందడుగు వేయడం కష్టమైపోతుంది.

అందుకే వదిలేసి వెళ్లిపోవాం. అందరూ బాగుండాలి. విశ్వక్సేన్ చిన్న కుర్రాడు. వాళ్లూ బాగుండాలి. వాళ్ల సినిమా సినిమా కూడా ఇప్పుడే రిలీజవుతోంది. అది కూడా బాగా ఆడాలి’’ అంటూ విశ్వక్‌‌కు శుభాకాంక్షలు చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు అర్జున్.

Related Post

వ‌ర్కింగ్ అవ‌ర్స్‌పై ర‌ష్మిక స్టాండ్?వ‌ర్కింగ్ అవ‌ర్స్‌పై ర‌ష్మిక స్టాండ్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 8 గంటల పని విధానంపై షరతులు పెట్టడాన్ని చాలామంది తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది డేట్లతో ముడిపడ్డ షూటింగ్స్‌లో టైమింగ్స్ పరంగా ఇంత కచ్చితంగా ఉంటే చాలా కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

Bhartha Mahasayulaku Wignyapthi Review- A Familiar Family ComedyBhartha Mahasayulaku Wignyapthi Review- A Familiar Family Comedy

Bhartha Mahasayulaku Wignyapthi is a 2026 Telugu-language romantic comedy and family drama written and directed by Kishore Tirumala. The film has Ravi Teja, Ashika Ranganath & Dimple Hayathi playing the

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం కూడా కొత్త కాదని చెప్పారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు ఓటములు చూశానని తెలిపారు.