hyderabadupdates.com Gallery వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం

వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం

వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం post thumbnail image

ఖ‌మ్మం జిల్లా : వెలుగుమ‌ట్ల నిర్వాసితుల‌కు 15 లోపు ప‌ట్టాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. బాధితులకు అండగా నిలుస్తాం అన్నారు. వెలుగుమట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయ‌ని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రజలు గమనించాలని, దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆవేదనను విని, భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను వండీ ,వార్చాయి తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
వాస్తవానికి ​వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించ లేద‌ని అన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. రెక్కాడితే గానీ డొక్కాడని వారు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని ఆరోపించారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారని మండిప‌డ్డారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మండిప‌డ్డారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌న్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామ‌న్నారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.
The post వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదంరూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

తిరుమ‌ల : టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల

తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోంతెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంత‌పు అస్తిత్వానికి భంగం క‌లిగించేలా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ‌నివారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట

తెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలుతెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలు

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాల‌నా ప‌రంగా మ‌రింత ప‌ట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజ‌య్ కుమార్ ను