hyderabadupdates.com movies వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం ఏప్రిల్ 3 బైకర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ శర్వా కష్టాన్ని బయట పెడుతున్నాయి తప్ప అసలు కంటెంట్ రివీల్ కావడం లేదు.

ఈ క్రమంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాల్సిన బాధ్యత బైకర్ బృందం మీద ఉంది. దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన రెండు వారాల తర్వాత రిలీజ్ కాబట్టి శర్వా టీమ్ టెన్షన్ పడనక్కర్లేదు. చక్కగా ప్రమోషన్లు చేసుకుంటే జనానికి ఇందులో ఏముందో రీచ్ అవుతుంది. స్పోర్ట్స్, అందులో తెలుగు జనాలకు అంతగా సుపరిచితం కాని బైక్ రేసింగ్ కాబట్టి దానికి అనుగుణంగా ప్రేక్షకులను చేరుకోవాలంటే ఏం చేయాలో ముందు దాన్ని ప్లాన్ చేసుకోవాలి.

కేవలం పోస్టర్లతో పనవ్వదు. మరిన్ని వీడియోలు బయటికి రావాలి. శర్వా జిమ్ లో కసరత్తులు చేయడం వగైరాలు ఓకే కానీ మరింత సాలిడ్ విజువల్స్ అసలు సినిమా నుంచి కట్ చేసి చూపించాలి. ముఖ్యంగా ట్రైలర్ ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బిజినెస్ పరంగా యువి క్రియేషన్స్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ డీసెంట్ సక్సెస్, రాబోయే విశ్వంభర పాన్ ఇండియా రిలీజ్ దృష్టిలో పెట్టుకుని బయ్యర్ల నుంచి కావాల్సినంత సహకారమే ఉంది.

సో బైకర్ కనక సరైన రీతిలో రిజిస్టర్ అయితే ఓపెనింగ్స్, వసూళ్లు రెండూ ఆశించవచ్చు. పోటీ కూడా పెద్దగా లేకపోవడం అడ్వాంటేజ్ అవుతుంది. డాల్బీ విజన్, 3డి లాంటి అత్యాధునిక ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టే హంగామా చేయాలి. లో ప్రొఫైల్ ఇలాంటి మూవీస్ కి సూట్ అవ్వదు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన బైకర్ కు జిబ్రాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Related Post

Aadi Pinishetty’s Thriller Drive Drops Gripping Trailer Ahead of Dec 12 ReleaseAadi Pinishetty’s Thriller Drive Drops Gripping Trailer Ahead of Dec 12 Release

The trailer of Drive, Aadi Pinishetty’s upcoming thriller, is out and has instantly captured attention with its intense, fast-paced storytelling. The film is gearing up for a grand theatrical release

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్