hyderabadupdates.com movies వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?

వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమానికి దళపతి విజయ్ రావడం, జగన్ పక్కనే ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

విజయ్–జగన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు తమ తమ ఊహాగానాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ అనుబంధ సోషల్ మీడియా ఈ ఫోటోలు, వీడియోలకు విస్తృత ప్రచారం ఇస్తోంది. ఇద్దరినీ పోలుస్తూ పోస్టులు పెడుతోంది. సాక్షి మీడియాలో కూడా జన నాయకుడు జగన్ తో జన నాయగన్.. అంటూ ఈ భేటీకి ప్రాధాన్యత ఇస్తూ కథనాలు వెలువడ్డాయి.

గతంలో తమిళనాడులో విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన కొన్ని బ్యానర్లలో జగన్ చిత్రాలు కనిపించాయి. ఏపీలో జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినట్లే, తమిళనాడులో తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని విజయ్ ప్రకటించిన అంశాన్ని అభిమానులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. 

ఇదే వేడుకకు మంచు మోహన్ బాబు, సూర్య, కార్తీ తదితరులు కూడా హాజరయ్యారు. అయితే విజయ్ జగన్ పక్కన కూర్చున్న ఫోటోలు, ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.

Related Post

స్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీస్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీ

దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణ గురించి సూచనలిచ్చే క్రమంలో ఆయన కొంచెం హద్దులు దాటిపోయారు. దానిపై తీవ్ర

అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని కుయుక్తులు పన్నుతోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. వారి వాదనలకు బలాన్ని చేకూర్చేలా విశాఖపట్నంలో ఐటీ పార్క్

డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?డిల్లీ లిక్కర్ కేసులో కవితకేం సంబంధం?

బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌కు ఢిల్లీ మ‌ద్యం కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ద‌ర్యాప్తు సంస్థ‌లు స‌రైన ఆధారాలు చూప‌లేక పోయాయని పేర్కొంటూ.. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న