hyderabadupdates.com movies వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ‘రాజసం’ ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్‌ను ఆపడం ఇప్పుడు ప్రతి జట్టుకూ టార్గెట్ గా మారింది. ముఖ్యంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే పోరులో అందరి కళ్లు వైభవ్ పైనే ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో గెలిచి రేసులోకి రావాలంటే రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను, ముఖ్యంగా వైభవ్‌ను కట్టడి చేయడం తప్పనిసరి.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తీరును గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. అతను కొట్టే సిక్సర్లలో మెజారిటీ భాగం లెగ్ సైడ్ వైపు నుండే వస్తున్నాయి. అంటే బాడీ లైన్ మీదకు వచ్చే బంతులను అతను అలవోకగా స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. కాబట్టి అతనికి వికెట్ల లైన్ మీద బంతులు వేయడం కరెక్ట్ కాదు. సన్‌రైజర్స్ బౌలర్లు అతనికి ఆఫ్ స్టంప్‌కు వెలుపల బంతులు వేస్తూ, షార్ట్ పిచ్ బంతులతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. తన జోన్ లో బంతి పడకుండా చూసుకుంటేనే అతని వేగానికి బ్రేక్ పడుతుంది. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ బౌలర్లతో అవుట్ స్వింగర్స్ వేయించడం ద్వారా వైభవ్‌ను త్వరగా అవుట్ చేసే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో ఇప్పుడు పెనుమార్పులు అవసరం. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు ధారాళంగా పరుగులు ఇస్తుండటం జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వారి అనుభవం వికెట్లు తీయడంలో ఉపయోగపడకపోగా, ప్రత్యర్థి బ్యాటర్లకు అది వరంగా మారుతోంది. కాబట్టి బెంచ్ మీద ఉన్న ప్రఫుల్ లేదా ఓంకార్ వంటి కొత్త బౌలర్లను రంగంలోకి దింపడం మంచిది. తెలియని బౌలర్లు ఎదురైనప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లు కొంత తడబడే అవకాశం ఉంటుంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని కేవలం బౌలర్‌గానే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా ప్రమోట్ చేస్తే మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుంది.

రాజస్థాన్ రాయల్స్ గెలుపు సూత్రం వారి టాప్ 3 బ్యాటర్లలోనే ఉంది. వైభవ్, జైస్వాల్, ధ్రువ్ జురెల్.. ఈ ముగ్గురూ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే స్కోరు బోర్డు 200 దాటడం ఖాయం. కానీ ఒకవేళ పవర్ ప్లేలోనే ఈ ముగ్గురినీ పడగొట్టగలిగితే రాజస్థాన్ కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే రియాన్ పరాగ్, హెట్మెయర్ లేదా రవీంద్ర జడేజా ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు. రాజస్థాన్ జట్టుకు ఉన్న ఈ బలహీనతను హైదరాబాద్ సరిగ్గా వాడుకోవాలి. టాప్-3ని వీలైనంత త్వరగా పెవిలియన్ పంపితేనే సన్‌రైజర్స్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు.

Related Post

Dhurandhar Box Office: Ranveer Singh film tops 200 crore worldwide with phenomenal Tuesday overseasDhurandhar Box Office: Ranveer Singh film tops 200 crore worldwide with phenomenal Tuesday overseas

Dhurandhar continues to showcase its exceptional trending at the overseas box office on weekdays. The Ranveer Singh headlined spy-thriller grossed USD 875K approx on Tuesday, taking its five-day running total