hyderabadupdates.com movies వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా.. బాబు షాకింగ్ స్టెప్‌..!

వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా.. బాబు షాకింగ్ స్టెప్‌..!

పార్టీల నేతల నుంచి ఒక్కోసారి ఎదురయ్యే సమస్యలు చాలా చిత్రంగానే కాకుండా తీవ్ర పరిస్థితులకు దారితీస్తాయి. అలాంటి వాటిని హ్యాండిల్ చేయడమే పార్టీ అధినేతలకు ఉండాల్సిన కీలక వ్యూహం. ఒక్కోసారి అలా కాదని నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. పోనీ మౌనంగా ఉంటే మరింత ప్రమాదం. అంటే సమస్యను సృష్టించడం నాయకులకు తేలికే కానీ వాటిని పరిష్కరించడం పార్టీ అధినేతలకు కత్తిమీద సామేనని చెప్పాలి.

ప్రస్తుత విషయాన్ని చెప్పుకొనేముందు గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నాయకుల వివాదాలపై పెద్దగా స్పందించలేదు. అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు వరకు వివాదాల్లో చిక్కుకున్నారు. వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. ఫలితంగా ఇబ్బందులు తప్పలేదు. ఇక టీడీపీ విషయానికి వస్తే నాయకుల వ్యవహారశైలి శృతి మించుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తాజా ఘటన విషయానికి వస్తే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డు మీద పడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోకి పాకింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కానీ ఇక్కడే చంద్రబాబుకు పెద్ద పరీక్ష ఎదురైంది. ఇరువురు నాయకులు తనకు సన్నిహితులే కావడంతోపాటు రెండు సామాజిక వర్గాల్లోనూ చంద్రబాబుకు ఫాలోయింగ్ ఉంది. దీంతో ఎవరి మీద చర్యలు తీసుకున్నా దానిని వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంది. కొలికపూడిపై చర్యలు తీసుకుంటే వెంటనే వైసీపీ ఎస్సీ కార్డును బయటకు తీసి వారి పట్ల వివక్షగా చెబుతుంది. పోనీ చిన్నిపై చర్యలు తీసుకుంటే మరో వాదనను ప్రాచారం చేసే అవకాశం ఉంది.

అందుకే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించాలని పార్టీ అధినేత నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో సామదాన భేదోపాయంతోనే సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Related Post

వైఫ్ ఆఫ్ చైతు.. పా.రంజిత్‌తోవైఫ్ ఆఫ్ చైతు.. పా.రంజిత్‌తో

తెలుగమ్మాయిలు తెలుగులో గుర్తింపు సంపాదించడమే కష్టం అంటే.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి రేంజికి వెళ్లింది శోభిత ధూళిపాళ్ల. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ.. ఆమె రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. తన సినిమా కెరీర్ లాగే వ్యక్తిగత జీవితం

Sankranti Magic Grows as Anil Ravipudi and Chiranjeevi Join ForcesSankranti Magic Grows as Anil Ravipudi and Chiranjeevi Join Forces

Sankranti has consistently proven to be a golden season for director Anil Ravipudi, whose films released during the festive period have delivered massive box-office results. From F2, which emerged as