hyderabadupdates.com Gallery వైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలి

వైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలి

వైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌కు పార్టీ ప‌రంగా మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంను మించిన ఉన్మాదంతో రాష్ట్రంలో జగన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.
చంపుతాం, నరుకుతాం, అంతుచూస్తాం, అంతం చేస్తాం వంటి రాజకీయ విధానాలతో జగన్ పోతున్నాడని మండిప‌డ్డారు నిమ్మ‌ల రామానాయుడు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, పనులు ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలు అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం అంటూ రాజకీయ హామీలు జగన్ ఇస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.
బయటి వారైనా, బాబాయ్ అయినా రాజకీయంగా అడ్డొస్తే, అంతం చెయ్యడమే జగన్ విధానం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. తల్లికి, చెల్లికి ఏం చేశానే అంతకంటే ఎక్కవు చేస్తాను అంటూ నయవంచక మహిళా విధానం జగన్ ది అని పేర్కొన్నారు. కొత్త, కొత్తగా మాద‌క‌ ద్రవ్యాలు తెస్తాం, యువతకు దానితో ఉపాధి కల్పించడమే జగన్ యూత్ పాలసీ అని మండిప‌డ్డారు. నేరాలు అరికడతాం, శాంతి భద్రతలు కాపాడుతాం అని కాకుండా రప్పా, రప్పా అంటూ నరుకుతాం అంటూ ఉన్మాదంతో మాట్లాడుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు నిమ్మ‌ల రామానాయుడు.
జగన్ అకృత్యాల్ని, వికృత చేష్టలను మీడియా చెబితే నాలుక కోసేస్తాం, పలుకు లేకుండా చేస్తాం, అంతం చేస్తాం అంటూ మీడియా పై ఉన్మాదంతో బహిరంగంగా మాట్లాడుతున్నారని , త‌న‌ను జ‌నం న‌మ్మ‌ర‌న్నారు. వినాశనం, విధ్వంశం, ఎజెండాగా గొడ్డలి జెండాగా వైసిపి పార్టీ గొడ్డలి పార్టీగా మారిందన్నారు.రాజకీయ భవిష్యత్ కోసం నాడు వివాదరహితుడు వివేకాను ఎంపి పదవికి రాజీనామాను బలవంతంగా జగన్ చేయిస్తే, సోనియా మందలించ లేదా అని ప్ర‌శ్నించారు. తండ్రి ఆచూకీ లభ్యం కాకుండానే సంతకాలు ఎలా పెట్టించుకున్నార‌ని అడిగారు. నాడు తండ్రి మరణానికి రిలయన్స్ కారణమని, తర్వాత వారికి పదవులు ఎలా ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు నిమ్మ‌ల రామానాయుడు..
The post వైసీపీకి రాష్ట్రంలో శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి క‌ట్టాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదలJammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల

    జమ్మూకశ్మీర్‌ లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభకు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా… ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుని

జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానంజ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి

మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్

నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విద‌ర్భ స్టేడియంలో జ‌రిగిన తొలి కీల‌క మ్యాచ్ లో సూర్య భాయ్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది. వ‌చ్చే నెల‌లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ