hyderabadupdates.com Gallery శ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖ

శ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖ

శ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖ post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన మంత్రి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 72 వేల మెట్రిక్ టన్నులు, నాఫెడ్ ద్వారా 12 వేల మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు చేశారు. మొత్తం 84 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తవడంతో ప్రస్తుతం ఉన్న లక్ష్యం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం 3,88,413 హెక్టార్లకు పెరిగింది. ఉత్పత్తి కూడా 4,57,365 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 94,500 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు లక్ష్యం మాత్రమే ఉన్నప్పటికీ, పెరిగిన ఉత్పత్తి దృష్ట్యా దానిని 4,57,365 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం మార్కెట్లో శనగ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు తమ మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు అదనపు కొనుగోళ్లు తప్పనిసరి అని మంత్రి అచ్చెన్నాయుడు భావించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా శనగ కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
The post శ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌నగవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్