hyderabadupdates.com movies శివాజీ మార్పు దండోరాకు ప్లస్ అవుతుందా

శివాజీ మార్పు దండోరాకు ప్లస్ అవుతుందా

నిన్న విడుదలైన దండోరాకు ప్రశంసలైతే వచ్చాయి కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఛాంపియన్, శంభాల, ఈషా ట్రెండింగ్ లో ఉండగా దండోరా మాత్రం రేస్ లో వెనుకబడిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ ను ఉద్దేశించి శివాజీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో చూశాం.

తర్వాత ఆయన పబ్లిక్ గా క్షమాపణ కోరడం, మహిళా కమీషన్ కు వెళ్లి వివరణ ఇస్తానని చెప్పడం జరిగిపోయాయి. అయినా సరే సోషల్ మీడియాలో చర్చ ఆగలేదు. మాములుగా ఇలాంటి నెగటివ్ విషయాలు సినిమా ప్రమోషన్లకు ఉపయోగపడతాయి. కానీ దండోరాకు ఇది జరగలేదని టీమ్ గుర్తించింది.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు వద్దని, మంచి సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకుంటానని, థియేటర్లకు వెళ్లి జనాలను కలుసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే కేవలం శివాజీ విజిట్ చేసినంత మాత్రాన ఫుట్ ఫాల్స్ పెరుగుతాయా అంటే అంతకన్నా ఆప్షన్ వేరొకటి లేదు.

ఎందుకంటే దండోరా క్యాస్టింగ్ మొత్తంలో జనం గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు ముగ్గురే. వాళ్ళు శివాజీ, నవదీప్, బిందు మాధవి. సో పబ్లిక్ లోకి వెళ్తే పబ్లిసిటీ పరంగా ఉపయోగపడొచ్చని భావించి ఉండొచ్చు, క్రిస్మస్ సినిమాలు అన్నింటికి దాదాపు ఒకే రేటింగ్స్, రివ్యూస్ వచ్చాయి.

కానీ దండోరా వాటిని క్యాష్ చేసుకోలేకపోయింది. సో ఇప్పుడీ వీకెండ్ చాల కీలకం. నిజానికి శివాజీ ఇందులో కోర్టుని మించిన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ అది జనంలో పూర్తి స్థాయిలో రీచ్ అవ్వలేదు. కోర్ట్ నిర్మాతగా నాని దాన్ని ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్లాడో చూశాం. కానీ దండోరాకు ఆ అవకాశం లేదు. అలాంటి బ్యాకప్ లేదు.

సో బరువంతా కంటెంట్ మీదే పడింది. సినిమాలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ బాగానే తీశారనే మాట దండోరాకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకుని కలెక్షన్లుగా మార్చుకోవాలి. కాంపిటేషన్ వల్ల థియేటర్లు పరిమితంగానే దొరికినా ఆడియన్స్ మద్దతు దొరికితే ఆటోమేటిక్ గా పెంచొచ్చు.

#Sivaji :”దయచేసి నా వ్యక్తిగత విషయాలకు పోవద్దు. అది నేను Seperate గా చూసుకుంటా.సినిమాని Promote చెయ్యండి, లేదంటే ఆ నింద నేను మొయ్యాలి.” pic.twitter.com/iJWXCz5dBE— Gulte (@GulteOfficial) December 26, 2025

Related Post

ప్రి రిలీజ్ ఈవెంట్లపై నటుడు షాకింగ్ కామెంట్స్ప్రి రిలీజ్ ఈవెంట్లపై నటుడు షాకింగ్ కామెంట్స్

సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో తెలుగు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు వేరు. ఒకప్పుడు ఆడియో వేడుకలుగా ఉన్న వాటినే తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్లుగా మార్చారు. ఐతే పేరు మారింది కానీ.. ఈవెంట్లు జరిగే తీరు మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. సాయంత్రం మొదలుపెట్టి లేట్

K-Ramp: Kiran Abbavaram’s Diwali Blockbuster Now Streaming on ahaK-Ramp: Kiran Abbavaram’s Diwali Blockbuster Now Streaming on aha

The Diwali hit “K-Ramp”, starring popular young hero Kiran Abbavaram, is now streaming on aha OTT, creating fresh buzz among audiences. Soon after its digital release, viewers began flooding social