hyderabadupdates.com Gallery శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం

శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం

శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం post thumbnail image

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌న టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి, శ్రద్ధలతో పాల్గొన్నార‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది.
తిరుమల ఎస్టేట్స్ అధికారి, డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్) శ్రీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిరంతరాయంగా సాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి ఐదు గంటలపాటు అంకిత భావంతో సేవలందించారని తెలిపారు.
లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఒంటిమిట్ట వేదిక‌గా జ‌రిగే శ్రీ కోదండ రాములోరి క‌ళ్యాణోత్స‌వానికి విశిష్ట అతిథిగా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఈ సంద‌ర్బంగా ప‌ట్టు వ‌స్త్రాలు ప్ర‌భుత్వం త‌ర‌పున స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.
The post శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలిఅధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న సోద‌రుడు , మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. విజ‌య‌వాడ‌లో ష‌ర్మిలా రెడ్డి

వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలివేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో కొలువు తీరిన‌ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం

బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలిబీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

అమరావతి : బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్