hyderabadupdates.com Gallery శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం post thumbnail image

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. సోమ‌వారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గతంలో నంది వాహనం ఊరేగింపు సమయం లో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకొని స్వామి వారి వాహనాలను మోసే వారిని ముందుగా గుర్తించి వారికి డ్రెస్ కోడ్ ఇవ్వడం జరింగిందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సార్లు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియ చేశామ‌న్నారు ఎస్పీ.
కానీ ఈరోజు నంది వాహనం తీసుకొని వస్తున్నప్పుడు కొంత మంది శివ స్వామి మాల దారులు క్రమశిక్షణా రాహిత్యంతో నంది వాహనాన్ని బలవంతంగా తీసుకోనే ప్రయత్నించార‌ని , దీంతో వాహ‌నం ఒక వైపు సొరిగి పోయింద‌న్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే ఉద్దేశంతో కంట్రోల్ చేసిన‌ట్లు తెలిపారు సుబ్బారాయుడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క భక్తునికి తక్కువ సమయంలో దర్శనం చేసుకునే లాగా పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానీ కొంత మంది వాస్తవ విషయాలను ధ్రువీకరించు కోకుండా, జరిగిన విషయాన్ని వక్రీకరించి భక్తులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారిపై చట్ట పరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ.
The post శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వైసీపీ పాల‌న వ‌ల్ల‌ ఏపీ 30 ఏళ్లు వెన‌క్కి : ప‌వ‌న్ క‌ళ్యాణ్వైసీపీ పాల‌న వ‌ల్ల‌ ఏపీ 30 ఏళ్లు వెన‌క్కి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. గ‌త ప్ర‌భుత్వం నిర్వాకం కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన

మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే

సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యంసర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

తిరుపతి : తిరుపతిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆల‌యం. ప్ర‌తి ఏటా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నాలుగో