hyderabadupdates.com Gallery శ్రీవారి కల్యాణోత్సవంలో టిటిడి చైర్మన్ నాయుడు

శ్రీవారి కల్యాణోత్సవంలో టిటిడి చైర్మన్ నాయుడు

శ్రీవారి కల్యాణోత్సవంలో టిటిడి చైర్మన్ నాయుడు post thumbnail image

ప‌శ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ నగరంలో ఉన్న శ్రీ వైకుంఠ ముఖద్వార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి బ్ర‌హ్మోత్స‌వాలు. ఈ ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ ముఖ్య అతిథిగా బి.ఆర్. నాయుడు హాజరయ్యారు. ఈ ఆలయంలో మార్చి 7 నుండి 16 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మాణానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
ముందుగా కోల్‌కతా విమానాశ్రయానికి టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు చేరుకోగా, అక్కడి తెలుగు సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న చైర్మన్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం టిటిడి చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉత్స‌వాల‌లో పాల్గొన్న అనంత‌రం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌లో శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామ‌ని చెప్పారు.
The post శ్రీవారి కల్యాణోత్సవంలో టిటిడి చైర్మన్ నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డితెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన

Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేసారు. చరిత్ర

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh : సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే ‘సమాధాన్‌ దివస్‌’ (ప్రజా ఫిర్యాదుల దినం)లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలోని (Uttar Pradesh) సీతాపుర్‌ కలెక్టర్‌ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్‌ రాత్రిపూట