hyderabadupdates.com Gallery శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని చెప్పారు . గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని అన్నారు సీఎం. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం అన్నారు. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ అది అని పేర్కొన్నారు. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించు కోకుండా యదేఛ్చగా కొనసాగించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపామ‌ని తెలిపారు. సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందన్నారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని పేర్కొన్నారు సీఎం. హైందవం పట్ల ఆయనకు విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా అని ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి.
The post శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల

Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందంSaudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

    సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ