hyderabadupdates.com Gallery శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ post thumbnail image

తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులతో కలిసి మేళతాళాల నడుమ, వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు . ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీ, ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వామిని ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఆ దేవ దేవుడు దేశ ప్ర‌జ‌ల‌కు సుఖ సంతోషాలు క‌లుగ చేయాల‌ని ప్రార్థించిన‌ట్లు తెలిపారు.
The post శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !

    కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ క్యాంపు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీఎం మార్పునకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట

CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదలCM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల

CM Nitish Kumar : బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు (CM Nitish Kumar) చెందిన జనతాదళ్ యునైటెడ్

మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబ‌రం అరెస్ట్ కాక త‌ప్ప‌దా. ఆ దిశ‌గా ఈడీ రంగంలోకి దిగింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్‌లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న