hyderabadupdates.com movies సంక్రాంతి ఫైట్… ఫైనల్ టైమ్ వచ్చేసింది

సంక్రాంతి ఫైట్… ఫైనల్ టైమ్ వచ్చేసింది

సంక్రాంతి రేసులో ఐదు సినిమాలకు తేల్చుకునే టైమ్ వచ్చేసింది. పండగ రోజులు గడిచిపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా స్టామినా ఏంటో, ప్రేక్షకులకు ఏది నచ్చిందో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. రేపు సోమవారం వర్కింగ్ డే కావడంతో దాదాపు సెలవులు అన్నీ ఆదివారంతో కంప్లీట్ అయిపోయాయి. దీంతో రేపటి నుండి మేజర్ సెంటర్లలో థియేటర్ల కేటాయింపులు కంప్లీట్ గా మారిపోబోతున్నాయి. 

ఇప్పటివరకు ఉన్న సెలవుల హడావుడి ఒక ఎత్తు అయితే, అసలైన విన్నర్‌ను తేల్చేసే ఫైనల్ రౌండ్ ఇప్పుడు మొదలైంది. ముఖ్యంగా ఏ సినిమాకైతే పాజిటివ్ టాక్ ఉందో, ఆ సినిమాలకు మరిన్ని థియేటర్లు పెంచే పనిలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు (MSG) ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా వెళుతోంది. పండగ సెలవులు అయిపోయినా ఆడియన్స్ రెస్పాన్స్ తగ్గకపోవడంతో, రేపటి నుండి ఈ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు నారీ నారీ నడుమ మురారి సినిమాకు బెస్ట్ మౌత్ టాక్ వచ్చినా, థియేటర్ల కొరత వల్ల వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పుడు థియేటర్ల కేటాయింపులు మారుతుండటంతో, శర్వానంద్ సినిమాకు ఎక్కువ షోలు దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ సినిమా సెకండ్ వీక్ లో కలెక్షన్ల పరంగా పుంజుకోవడం ఖాయం. అటు అనగనగా ఒక రాజు కూడా తన జోరును కొనసాగిస్తోంది.

ఇక డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం ఇప్పుడు అసలైన గండం మొదలైంది. సెలవులు ముగియడంతో టాక్ పరంగా కలిసిరాని చిత్రాలకు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్న సినిమాల ప్లేస్ లో, టాక్ బాగున్న చిత్రాలను వేయడానికి ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది రాజాసాబ్ సినిమాల పర్ఫార్మెన్స్ ను బట్టి వాటి థియేటర్ల విషయంలో మార్పులు ఉండవచ్చు.

ఫైనల్ గా ఈ సంక్రాంతి పోరు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. సెలవుల అడ్వాంటేజ్ అయిపోయింది కాబట్టి, కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే థియేటర్ల వద్ద ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ దక్కుతుంది. రేపటి నుండి మారబోయే ఈ స్క్రీన్ కౌంట్‌తో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అసలైన విజేత ఎవరో తేలిపోతుంది. మరి ఈ థియేటర్ల రేసులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Related Post

పవన్ ఫ్యాన్స్ అంటే అంతే మరి…పవన్ ఫ్యాన్స్ అంటే అంతే మరి…

అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు అని చెప్పొచ్చు. పవన్ ఎంచుకునే కొన్ని సినిమాల విషయంలో వాళ్ల నుంచి మొదట తీవ్ర వ్యతిరేకత వస్తుంటుంది. రీమేక్‌లను ఎంచుకోవడం.. సరైన డైరెక్టర్లతో పని చేయకపోవడం పట్ల వారు తమ అసహనాన్ని