hyderabadupdates.com movies సంక్రాంతికి అది అమ్మితే హత్యాయత్నం కేసు!

సంక్రాంతికి అది అమ్మితే హత్యాయత్నం కేసు!

సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో పతంగులు ఎగురవేయొద్దని, నిషేధం విధించిన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా చాలామంది ఆ మాట పెడచెవిన పెడుతున్నారు.

ఈ సంక్రాంతి సందర్భంగా కూడా చైనా మాంజా బారిన పడి ఇద్దరు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా కట్టడి కోసం నిజామాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

చైనా మాంజా అమ్మితే హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ లో ఆల్రెడీ ఐదుగురు వ్యాపారులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి 35 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయాల కట్టడికి ఇటువంటి కఠిన చర్యలు తప్పడం లేదని చెబుతున్నారు.

మాంజా విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న వెంటనే ఆ దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా, సూచనలు చేస్తున్నా వినకపోవడంతోనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా మరొకరిని బలి తీసుకుంది. ఫసల్వాది గ్రామంలో చైనా మాంజా తగిలి బైక్ పై వెళుతున్న వ్యక్తి గొంతు తెగిపోయింది. బైక్ మీద వెళ్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తగలడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి నిన్న వచ్చిన అవిదేశ్ ను చైనా మాంజా బలి తీసుకుంది. దీంతో, లోహ్రీ పండుగ నాడు అవిదేశ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Post

Zendaya and Robert Pattinson Engaged? First Look at Their Sparkling Romance in The DramaZendaya and Robert Pattinson Engaged? First Look at Their Sparkling Romance in The Drama

A24’s engagement announcement sparks curiosity A24 added to the excitement by posting a mock engagement announcement featuring Zendaya and Robert Pattinson as Emma Harwood and Charlie Thompson. The black-and-white photo

చికిరి వెనుక చరణ్ ఐడియాచికిరి వెనుక చరణ్ ఐడియా

చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ఈ పాటలోని ఐకానిక్ స్టెప్పుల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్