hyderabadupdates.com movies సంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుంది

సంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుంది

ఇప్పుడేదో సంక్రాంతి సినిమాల హడావిడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకుంటున్నాం కానీ మార్చిలో అసలైన ఫైట్ చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే పొంగల్ కు జరిగింది గొప్పగా చెప్పుకునే కాంపిటీషన్ కాదు. బడ్జెట్ పరంగా రాజా సాబ్ డామినేషన్ ఎక్కువగా ఉంటే, రికార్డులు కలెక్షన్ల పరంగా మన శంకరవరప్రసాద్ గారు ఆధిపత్యం చెలాయించింది.

అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి హిట్టయినా వాటి రేంజ్, వసూళ్ల స్పాన్ మీడియం రేంజ్ లోనే ఆగిపోతాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సక్సెస్ స్టాంపుతో బయట పడింది. ఇది కాదు కానీ అసలు మజా మూవీ లవర్స్ మార్చ్ నెలలో రానుంది.

మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు లేదని దురంధర్ 2 మేకర్స్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు. వచ్చే వారం విడుదల కాబోతున్న బోర్డర్ 2 తో పాటు టీజర్ అటాచ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జియో స్టూడియోస్ నుంచి విడుదల తేదీ గురించి డిస్ట్రిబ్యూటర్లకు పక్కా సమాచారం వెళ్లిపోయిందని ముంబై టాక్.

అదే రోజు యష్ టాక్సిక్ రిలీజ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదని కెవిఎన్ ప్రొడక్షన్ వైపు నుంచి పంపిణిదారులకు కన్ఫర్మేషన్ వెళ్లిందట. టీజర్ కాంట్రవర్సి చూశాక బయ్యర్లు మరింత ఉత్సాహంతో మంచి రేట్లు ఆఫర్ చేస్తున్నారని బెంగళూరు టాక్.

అడివి శేష్ డెకాయిట్ అదే రోజు రావాలి. ఆల్రెడీ టీజర్ లో స్పష్టంగా చెప్పేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే రెండు వాయిదాలు పడిన నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ వద్దని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.

ఇవి వచ్చిన వారానికే రామ్ చరణ్ పెద్ది దిగుతాడు. సందర్భం దొరికిన ప్రతిసారి హీరోతో పాటు దర్శకుడు బుచ్చిబాబు మార్చి 27 రిలీజని నొక్కి నొక్కి చెబుతున్నారు. నాని ప్యారడైజ్ దాని కన్నా ముందు మార్చి 26 రావాలి. ఇప్పటికైతే పోస్ట్ పోన్ ప్రస్తావన తేవడం లేదు. ఒకవేళ వీళ్ళందరూ మాట మీద ఉండే పక్షంలో 2026 మార్చ్ సంక్రాంతిని మించిన సునామి సృష్టించడం ఖాయం.

Related Post