hyderabadupdates.com Gallery సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి post thumbnail image

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమాషియాలో యుద్ద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై ఏక‌ప‌క్ష దాడుల‌కు దిగింది. కానీ ఇరాన్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆ రెండు దేశాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 10 రోజులు కాదు అవ‌స‌ర‌మైతే 10 ఏళ్ల పాటు త‌ల‌ప‌డేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది ఇరాన్ స‌ర్కార్. దీంతో దెబ్బ‌కు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ల బేరానికి వ‌చ్చాడు. గ‌త్యంత‌రం లేక వారం రోజుల పాటు యుద్దాన్ని నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు త‌న సోష‌ల్ మీడియా ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో ప‌రిస్థితులు కొంత మేర‌కు అదుపులోకి వ‌చ్చినా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ కొర‌త నెల‌కొంది. ఆయా దేశాల‌న్నీ విల విల లాడుతున్నాయి.
ఈ త‌రుణంలో ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. పశ్చిమాసియా సంక్షోభాన్ని సమీక్షించారు. ఈ కీల‌క మీటింగ్ లో విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రత, సరఫరా గొలుసు స్థిరత్వం, కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో సన్నద్ధతా చర్యలతో సహా పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి చర్చించారు. తలెత్తే ఏవైనా సవాళ్లకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు సిద్దంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్బంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. సాధార‌ణ పౌరుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు.
The post సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేతAnil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani : అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ (Anil Sahani) బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే

గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరాగ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరా

అమ‌రావ‌తి : రాష్ట్రంలో చేప‌ట్టిన గ్రీన్ క‌వ‌ర్ ప్రాజెక్టుల పురోగ‌తిపై ఆరా తీశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అమ‌రావ‌తి లోని వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని 2వ బ్లాకులో కీలక స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా అట‌వీ శాఖ

Tirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభంTirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభం

Tirumala : తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది.