hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం

సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం

సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం post thumbnail image

గుజ‌రాత్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే కీల‌క మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై ఇంకా మౌనం వ‌హించ‌డం ప‌ట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై మండిప‌డుతున్నారు శాంస‌న్ అభిమానులు. సూపర్ 8 మ్యాచ్‌లలో భాగంగా ఈ కీల‌క మ్యాచ్ భార‌త జ‌ట్టుకు అత్యంత కీల‌కం. ప్ర‌స్తుతం టీం ఇండియా తీవ్ర స‌మస్య‌ను ఎదుర్కొంటోంది. ప్ర‌త్యేకించి ఓపెన‌ర్లుగా ఇద్ద‌రిని ప్రయోగించింది మేనేజ్మెంట్. ఓపెన‌ర్లు గా అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ ఆశించిన మేర రాణించ‌లేదు.
మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ ల‌లో శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. మ‌రో వైపు న‌మీబియాతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు శాంస‌న్. కేవ‌లం ఎనిమిది బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో మూడు సిక్సుల‌తో పాటు ఒక ఫోర్ కొట్టాడు. 22 ప‌రుగులు చేశాడు. 272 స్ట్రైక్ రేట్ తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ ల నుంచి ఆడ‌కుండా త‌ప్పించారు. కేవ‌లం త‌న‌ను బెంచ్ కే ప‌రిమితం చేశాడు. తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది సంజు శాంస‌న్. మ‌రో వైపు తిల‌క్ వ‌ర్మ ను తీసేసి శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా అహ్మ‌దాబాద్ లో సంజు శాంస‌న్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వ‌చ్చాడు. దీన్ని బ‌ట్టి త‌న‌ను తుది జ‌ట్టుకు ఎంపిక చేస్తార‌ని స‌మాచారం.
The post సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

    దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర

లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడులాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై

Maoist Asanna: మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటుMaoist Asanna: మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

Maoist Asanna: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత ఆశన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత