hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్

సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్

సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్ post thumbnail image

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం పై ఆస‌క్తక‌ర వ్యాఖ్య‌లు చేశాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. త‌ను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌ను మామూలు ఆటగాడు కాద‌ని, వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ అని పేర్కొన్నాడు. త‌న‌లో ఆ టాలెంట్ ఉంది కాబ‌ట్టే తిరిగి ఛాన్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పాడు. త‌ను ఏనాడూ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడిన దాఖ‌లాలు లేవ‌న్నాడు. అందుకే త‌న‌కు అత్య‌ధికంగా ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్లు తెలిపాడు గంభీర్. ప్ర‌తి ఆట‌గాడికి ఒక్కోసారి గ‌డ్డు స‌మ‌యం వ‌స్తుంద‌ని, దానిని క‌వ‌ర్ చేసుకోగ‌లిగితే ఆ త‌ర్వాత రెచ్చి పోవ‌డం ఖాయ‌మ‌న్నాడు.
ఇదే సంజు శాంస‌న్ విష‌యంలో నిరూపిత‌మైంద‌ని పేర్కొన్నాడు హెడ్ కోచ్. పొట్టి ఫార్మాట్ లో మూడు సెంచ‌రీలు చేసిన చ‌రిత్ర త‌న‌ది, ఇదే క్ర‌మంలో స్వ‌దేశంలో జ‌రిగిన న్యూజిలాండ్ సీరీస్ లో అవ‌కాశం ఇచ్చాం. కానీ అనుకోకుండా త‌ను చెత్త షాట్స్ ఆడి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అందుకే కొంత విరామం కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డం జ‌రిగింద‌ని అన్నాడు గంభీర్. అంతే త‌ప్పా కావాల‌ని త‌న‌ను తొల‌గించ లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. సౌతాఫ్రికా తో ఓడి పోయాక కుడి, ఎడ‌మ‌ల కాంబినేష‌న్ అవ‌స‌ర‌మ‌ని భావించామ‌ని, దీంతో త‌న‌కు స‌రైన ఆట‌గాడు సంజు శాంస‌న్ మాత్ర‌మేన‌ని తేలి పోయింద‌న్నాడు. త‌ను న‌మీబియా, జింబాబ్వేతో పాటు కీల‌క‌మైన క్వార్ట‌ర్ ఫైన‌ల్ , సెమీ ఫైన‌ల్, ఫైన‌ల్ మ్యాచ్ ల‌లో స‌త్తా చాటాడ‌ని, ఇవాళ నేష‌న‌ల్ హీరో అయ్యాడ‌ని కితాబు ఇచ్చాడు గంభీర్.
The post సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేనుసంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను

ముంబై : భార‌త క్రికెట్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మంగ‌ళ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. అంద‌రూ త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాల‌యాల‌కు పెద్ద ఎత్తున బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెష‌ల్ బ‌స్సులు కేటాయించామ‌న్నారు

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాటIndian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను